‘కరోనా’ రూమర్లపై స్పందించిన యాంకర్ ఝాన్సీ

బుల్లితెర షూటింగ్‌ల్లో పాల్గొంటున్న వారిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఐదారు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, వారితో కాంటాక్ట్ అయిన వారు సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోతున్నారు.

'కరోనా' రూమర్లపై స్పందించిన యాంకర్ ఝాన్సీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 06, 2020 | 9:10 AM

బుల్లితెర షూటింగ్‌ల్లో పాల్గొంటున్న వారిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఐదారు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, వారితో కాంటాక్ట్ అయిన వారు సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో యాంకర్‌ ఝాన్సీకి కరోనా సోకినట్లు ఇటీవల పుకార్లు వినిపించాయి. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించిన ఝాన్సీ, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు.

ఇటీవల ఓ టీవీ షూటింగ్‌లో పాల్గొనగా.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఝాన్సీ తెలిపారు. కాగా ఈ యాంకర్‌కి ఎలాంటి లక్షణాలు లేవని, కానీ ఇంట్లో తన తల్లిదండ్రులతో కలిసి ఉండటంతోనే ఝాన్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఝాన్సీ చేసిన షోలో పాల్గొన్న ఇద్దరు నటులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఝాన్సీ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు టాక్‌.