మాజీ భర్తకు థ్యాంక్స్‌ చెప్పిన ‘టెంపర్‌’ నటి

తన మాజీ భర్త సెల్వ రాఘవన్‌కి ధన్యవాదాలు తెలిపింది నటి సోనియా అగర్వాల్‌. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన కాదల్‌ కోండియన్ చిత్రం ద్వారా సోనియా హీరోయిన్‌గా పరిచయం అవ్వగా..

మాజీ భర్తకు థ్యాంక్స్‌ చెప్పిన 'టెంపర్‌' నటి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 06, 2020 | 8:11 AM

తన మాజీ భర్త సెల్వ రాఘవన్‌కి ధన్యవాదాలు తెలిపింది నటి సోనియా అగర్వాల్‌. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన కాదల్‌ కోండియన్ చిత్రం ద్వారా సోనియా హీరోయిన్‌గా పరిచయం అవ్వగా.. ఈ మూవీ విడుదలై ఇటీవల 17 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన సోనియా సెల్వకు థ్యాంక్స్ చెప్పింది.

దేవుడికి, తమిళనాడు ప్రేక్షకులకు, సెల్వ రాఘవన్‌కి, కస్తూరి రాజాకు చాలా థ్యాంక్స్‌. హీరోయిన్‌గా నన్ను ప్రేక్షకులకు పరిచయం చేసి 17 సంవత్సరాలు పూర్తి అయ్యింది. అలాగే ధనుష్‌, కాదల్‌ కోండెన్‌కి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తమిళ సినీ పరిశ్రమలో ఇది ఓ గుర్తుండిపోయే చిత్రం అని సోనియా ట్వీట్‌ చేశారు.

కాగా కాదల్ కోండెన్‌లో ధనుష్‌ హీరోగా నటించగా.. ఆయన సోదరుడు సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించే సమయంలోనూ సెల్వతో ప్రేమలో పడ్డారు సోనియా. ఆ తరువాత ఈ ఇద్దరు 2008లో వివాహం చేసుకోగా.. కొన్ని కారణాల వలన 2010లో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తరువాత సెల్వ, గీతాంజలిని పెళ్లి చేసుకోగా, సోనియా ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోంది.