బాలీవుడ్​ దర్శకుడితో ప్రభాస్​ మూవీ..!

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

బాలీవుడ్​ దర్శకుడితో ప్రభాస్​ మూవీ..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 06, 2020 | 11:00 AM

టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. వీటి తర్వాత చేయ‌బోయే సినిమాపై కూడా డార్లింగ్ ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. తాను హోమ్ బ్యాన‌ర్ లా భావించే ‘యువీ క్రియేషన్స్’‌లోనే ప్ర‌భాస్ ఆ చిత్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అగ్రిమెంట్ కూడా కుదిరినట్లు స‌మాచారం.

ఈ సినిమాని బాలీవుడ్‌కి చెందిన దర్శకుడు తెరకెక్కించే అవకాశాలున్నాయ‌ని టాక్ నడ‌స్తోంది. అయితే’ బాహుబ‌లి’ సిరీస్ త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయ‌న సినిమాల‌కు భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ప్రభాస్‌ ఏ భాషలో మూవీ చేసినా.. ఏ దర్శకుడితో ప‌నిచేసినా అది చాలా భాషల్లోనూ రిలీజ‌వుతుంది. ప్ర‌స్తుతం డార్లింగ్ రేంజ్ పాన్‌ ఇండియా స్థాయిని దాటి వెళ్లింద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇత‌ర దేశాల్లో సైతం ఆయ‌న సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. మ‌రి ప్ర‌భాస్ త‌న స్టామినాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఇంకా ఎంత‌దూరం తీసుకెళ్తాడో చూడాలి.