AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో నటుడిని బలి తీసుకున్న కరోనా

కరోనా మహమ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. ఈ వైరస్‌ బారిన పడిన హాలీవుడ్‌ నటుడు నిక్‌ కార్డెరో(41) కన్నుమూశారు.

మరో నటుడిని బలి తీసుకున్న కరోనా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2020 | 12:05 PM

Share

కరోనా మహమ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. ఈ వైరస్‌ బారిన పడిన హాలీవుడ్‌ నటుడు నిక్‌ కార్డెరో(41) కన్నుమూశారు. కరోనాతో 90 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఈ నటుడు.. ఆదివారం తుది శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన నిక్ భార్య అమంద క్లూట్స్.. ”మరో ఏంజిల్‌ని దేవుడు స్వర్గానికి తీసుకువెళ్లాడు. నిక్‌ చాలా ప్రతిభావంతమైన వ్యక్తి. అతడు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. చాలా అద్భుతమైన నటుడు. సంగీతకారుడు. కుటుంబాన్ని అతడు చాలా బాగా ఇష్టపడేవారు. ఎల్విస్‌(కుమారుడు), నేను ప్ర‌తీరోజు అత‌న్ని మిస్ అవుతూనే ఉంటాం” అని ట్వీట్‌ చేశారు.

అయితే మార్చి 30న ఐసీయూలో చేరిన నిక్‌ పరిస్థితి రోజు రోజుకు క్షీణించింది. ఆయన కుడికాలులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు ఆ కాలును సైతం తొలగించారు. రెండు సార్లు కాలేయ మార్పిడి చేసినట్లు కూడా సమాచారం. అయినా ప్రయోజం లేకపోగా.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ నిక్‌ ఆదివారం కన్నుమూశారు. కాగా బుల్లెట్స్ ఓవ‌ర్ బ్రాడ్‌వే, రాక్ ఆఫ్ ఏజెస్‌, వెయిట్ర‌స్‌, ఎ బ్రాంక్స్ టేల్ వంటి ప‌లు చిత్రాలతో పాటు బ్లూ బ్ల‌డ్స్, లా అండ్ ఆర్డ‌ర్‌: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్‌, లిలీహ్యామ‌ర్ వంటి సిరీస్‌లోనూ క‌నిపించిన నిక్ మరణంపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Follow Us
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..