Good Bad Ugly : ఎట్టకేలకు ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన అజిత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులకు తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రావాల్సిన విదాముయార్చి సినిమా వాయిదా పడడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించాడు అజిత్.

Good Bad Ugly : ఎట్టకేలకు ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన అజిత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
Good Bad Agly
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 07, 2025 | 7:20 AM

కోలీవుడ్ స్టార్ అజిత్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి కానుకగా అజిత్ నటించిన విదాముయార్చి సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆ చిత్రాన్ని వాయిదా వేయడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతికి అజిత్ సినిమా రిలీజ్ చేయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ఫైట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అజిత్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, యోగిబాబు, ప్రసన్న, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది మే 2022లో ప్రారంభమై హైదరాబాద్‌లో కొద్ది రోజులు జరిగింది. ఆ తర్వాత తరువాత, బల్గేరియా, స్పెయిన్ సహా ఇతర దేశాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ చూసి అంచనాలు పెరిగాయి.

గుడ్ బ్యాడ్ అట్లీ మిగతా అజిత్ సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ 2025 పొంగల్‌కు విడుదల కానుంది. అయితే ఈ చిత్రాన్ని పొంగ‌ల్ పండుగ‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించినా ఆ త‌ర్వాత వాయిదా ప‌డింది. గుడ్ బ్యాడ్ అగ్లీని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.