Tollywood : పుష్ప 2 గంగమ్మ జాతర గెటప్‌లో జబర్దస్త్ నటుడు.. ఎవరో గుర్తుపట్టారా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాహుబలి 2 రికార్డ్ సైతం క్రాస్ చేసింది.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న లేటేస్ట్ మూవీ పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సత్తా చాటుతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప. దీంతో ఇప్పుడు ఈ మూవీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇందులో అల్లు అర్జున్ మాస్ నటవిశ్వరూపం చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న పుష్ప 2 సినిమా మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఫ్యాన్స్ అయితే పుష్ప 2 విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నెల రోజులైనా ఇంకా నార్త్ లో అయితే హడావిడి తగ్గట్లేదు.
పుష్ప 2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లతోపాటు గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ బాగా హైలెట్ అయ్యింది. గంగమ్మ తల్లి గెటప్ లో అల్లు అర్జున్ చీర కట్టుకుని, నగులు పెట్టుకుని, మేకప్ వేసుకుని గంగమ్మ తల్లి జాతరలో డ్యాన్స్ చేయడమే కాకుండా అదే గెటప్ తో ఫైట్ చేస్తాడు. ఈ సినిమాలో ఈ జాతర సీక్వెన్స్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ నటవిశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో థియేటర్లలో సైతం పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చీరకట్టుకుని గంగమ్మ తల్లి గెటప్ లో వచ్చి సందడి చేశారు. తాజాగా మరో జబర్దస్త్ నటుడు సైతం గంగమ్మ తల్లి గెటప్ లో కనిపించాడు. పైన ఫోటోను చూస్తున్నారు. కదా. అందులో కనిపిస్తున్న ఆ నటుడు ఎవరో గుర్తుపట్టండి.
అతడే జబర్దస్త్ నటుడు కెవ్వు కార్తీక్. అల్లు అర్జున్ లాగే చీరకట్టి, మేకప్ వేసి పుష్ప 2 గంగమ్మ జాతర గెటప్ లో తయారయ్యాడు. తాజాగా ఆ గెటప్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే తన స్కిట్ కోసమే ఈ గెటప్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.