AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major Movie: మేజర్ చిత్రానికి టికెట్స్ రేట్స్ భారీగా తగ్గింపు.. అసలు విషయం చెప్పిన హీరో శేష్..

26/11 ముంబై దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో

Major Movie: మేజర్ చిత్రానికి టికెట్స్ రేట్స్  భారీగా తగ్గింపు.. అసలు విషయం చెప్పిన హీరో శేష్..
Adivi Sesh
Rajitha Chanti
|

Updated on: May 27, 2022 | 5:45 PM

Share

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం మేజర్.. డైరెక్టర్ శశి కిరణ్ తిక్క  దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు(Major). 26/11 ముంబై దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. సెన్సార్ తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేజర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పిటేక విడుదలైన ట్రైలర్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది. తాజాగా మేజర్ చిత్రం టికెట్స్ రేట్స్ గురించి ట్విట్టర్ వేదికగా స్పందించాడు హీరో అడివి శేష్. ఇది మన సినిమా.. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సినిమా టికెట్ ధరలను నిర్ణయించాం అంటూ మేజర్ చిత్ర టికెట్ ధరల పట్టికను పోస్ట్ చేశారు..

కరోనా సంక్షోభం తర్వాత అతి తక్కువ రేట్లతో ఈ చిత్రాన్ని చూడొచ్చు.. తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ పై రూ. 150, ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ రూ. 147 టికెట్ ధర ఉంటుంది.. అలాగే మల్టీప్లెక్స్ లో తెలంగాణలో అయితే రూ. 195 ఉండగా.. ఏపీలో రూ. 177గా ఉంటుందని అడివి శేష్ తెలిపారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, మహేష్ బాబు సొంత సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి నాయర్, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో మేజర్ ప్రీవ్యూ షో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

Follow Us