AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన వరుణ్ తేజ్..

ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా సోనాల్ చౌహన్ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో

Varun Tej: ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన వరుణ్ తేజ్..
Varun Tej
Rajitha Chanti
|

Updated on: May 27, 2022 | 11:03 AM

Share

”ఎఫ్ 3 నవ్వుల పండగలా వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు” అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా ఈరోజు థియేటర్లలో ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా సోనాల్ చౌహన్ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు..

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడమే కష్టం. ఫన్ డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా వుంటుంది.. అతనికి కనబడదు… వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ చేశాం. అది హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యింది. అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డా. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన వుండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఈజీ అయ్యింది. ఐతే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. ఐతే అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ” అంటూ చెప్పుకొచ్చారు.