Pakka commercial: అందాల రాశి పాటకు డేట్ ఫిక్స్.. పక్కా కమర్షియల్ నుంచి మరో అప్డేట్..

ఈ సినిమాను ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్

Pakka commercial: అందాల రాశి పాటకు డేట్ ఫిక్స్.. పక్కా కమర్షియల్ నుంచి మరో అప్డేట్..
Pakka Commercial
Follow us
Rajitha Chanti

|

Updated on: May 27, 2022 | 11:18 AM

టాలెంటెడ్ హీరో గోపిచంద్ (Gopichand) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్ (Pakka Commercial).. ఈ సినిమాను ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్   స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా నిలిచిన జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది.

ఇవి కూడా చదవండి

గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..