Vikram: 400కు పైగా థియేటర్లలో విక్రమ్ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కమల్ మూవీ..

గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని

Vikram: 400కు పైగా థియేటర్లలో విక్రమ్ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కమల్ మూవీ..
Vikram
Follow us
Rajitha Chanti

|

Updated on: May 27, 2022 | 11:36 AM

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష కనగరాజ్ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం విక్రమ్. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కీలపాత్రలలో నటిస్తున్నారు.. అంతేకాకుండా.. తమిళ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఇప్పటికే ట్రైలర్‌తో ప్రమోషన్‌ల జోరు పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400+ థియేటర్లలో ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. ఇదీలావుండగా నితిన్ తండ్రి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, కమల్ హాసన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా విక్రమ్ తెలుగు పోస్టర్‌ను కమల్ హాసన్‌కి అందించారు. తెలుగులో ప్రమోషన్ స్ట్రాటజీ గురించి చర్చించారు. కమల్ హాసన్ తో పాటు చిత్ర యూనిట్ తో తెలుగులో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..