Rashmika Mandanna: బడా నిర్మాత పుట్టిన రోజు వేడుకల్లో రష్మిక.. ఆ విషయంలో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లో ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ హావా ఎక్కువగా కనిపించింది. రకుల్, పూజా హెగ్డే, ఛార్మీ, పూరీ జగన్నాథ్, తమన్నా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా..
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలు గురువారం అతని నివాసంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తన 50వ బర్త్ డే సెలబ్రెషన్స్ కోసం కేవలం ఉత్తరాదీ నటీనటులనే కాకుండా దక్షిణాది సెలబ్రెటీలను సైతం ఆహ్వానించారు. కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లో ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ హావా ఎక్కువగా కనిపించింది. రకుల్, పూజా హెగ్డే, ఛార్మీ, పూరీ జగన్నాథ్, తమన్నా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. కరణ్ బర్త్ డే వేడుకల్లో సందడి చేశారు. ఈ క్రమంలో స్టార్స్ డ్రైస్సింగ్ స్టైల్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ తారలతోపాటు.. దక్షిణాది సెలబ్రెటీల డ్రెస్సింగ్ పై ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బ్యూటీ రష్మికపై ట్రోలింగ్ కాస్త ఎక్కువగానే జరుగుతుంది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆమె వీడియో. కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలలో రష్మిక బ్లాక్ డ్రెస్ లో అందంగా ముస్తాబయ్యింది. ఎంతో గార్జియస్ గా బ్లాక్ లుక్ లో తళుక్కున మెరిసిన రష్మిక.. రెడ్ కార్పెట్ నడుస్తూ కాస్త ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. పదే పదే ఆమె ధరించిన డ్రెస్ కాళ్ల కిందకు రావడం.. రష్మిక సరి చేయడానికి ప్రయత్నించడం.. నడవడానికి ఇబ్బంది పడడం వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సౌకర్యంగా లేనప్పుడు ఆమె ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంది ?.. ఎక్కువగా అసౌకర్యంగా ఉంది ఆ దుస్తులలో..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక.. పుష్ప 2 సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram