MM Keeravani: ఉస్తాద్గా రాబోతున్న ఎంఎం కీరవాణి తనయుడు.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ఉస్తాద్ (Ustaad).. ఈ చిత్రాన్ని ఎ సాయి కొర్రపాటి ప్రొడక్షన్.. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు

ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) తనయుడు శ్రీ సింహ వెండితెరపై హీరోగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. మత్తువదలరా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు అందుకున్నాడు. ఆ తర్వాత తెల్లవారితో గురువారం.. దొంగలున్నారు జాగ్రత్త వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ఉస్తాద్ (Ustaad).. ఈ చిత్రాన్ని ఎ సాయి కొర్రపాటి ప్రొడక్షన్.. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
ఉస్తాద్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి, కాల భైరవతో పాటు దర్శకులు వెంకటేష్ మహ, శ్రీనివాస్ గవిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమాలో హీరోయిన్ సహా ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు. అలాగే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తుందని మేకర్స్ తెలిపారు..ఊహించని దానికంటే ఎక్కువగానే ఈ సినిమా ఉండబోతుందన్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలిపారు.




