Adivi Sesh: పెళ్లి గురించి అడివి శేష్ షాకింగ్ కామెంట్స్.. అసలు విషయం బయటపెట్టేసిన యంగ్ హీరో..

ఎవరు, క్షణం, గూఢచారి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. 26/11 ముంబై దాడులలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్

Adivi Sesh: పెళ్లి గురించి అడివి శేష్ షాకింగ్ కామెంట్స్.. అసలు విషయం బయటపెట్టేసిన యంగ్ హీరో..
Adivi Sesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2022 | 11:46 AM

మేజర్ (Major) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh). ఎవరు, క్షణం, గూఢచారి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. 26/11 ముంబై దాడులలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రంలో సందీప్ పాత్రలో ఒదిగిపోయాడు అడివి శేష్. డైరెక్టర్ శశికిరణ్ తిక్క రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకుల మనసులను తాకింది. మేజర్ సందీప్ జీవితంలో జరిగిన సంఘటనలను ప్రజలకు కళ్లముందుకు తీసుకువచ్చారు అడివి శేష్.. జూన్ 3న విడుదలైన ఈ మూవీ సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఎప్పుడూ వ్యక్తిగత విషయాల పట్ల స్పందించని అడివి శేష్.. తాజాగా తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అడివి శేష్.. తన జీవితంలో ప్రేమ, పెళ్లి పట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.. తాను ఫారిన్ లో పెరగడం వలన ఇంగ్లిష్ మాట్లాడే స్టైల్ వేరుగా ఉంటుందని.. ఇక్కడికి వచ్చాక అందరూ వెక్కిరిస్తున్నారని మార్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు.. అలాగే తనకు సిగరెట్, మందు, డ్రగ్స్ అలవాట్లు లేవని.. ఇప్పటివరకు వాటికి దూరంగా ఉన్నానని తెలిపారు… ఇక అందరూ అడుగుతున్నట్లు తన పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు కూడా ఎదురుచూస్తున్నారని చెప్పారు… ఈ క్రమంలో తనకు లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా ? అని అడగ్గా.. అడివి శేష్ స్పందిస్తూ.. నిజంగానే అలాంటి స్టోరీ ఉంది.. లవ్ లో దెబ్బతిన్నాను.. యూఎస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను.. నా పుట్టినరోజు నాడే తన పెళ్లి జరిగింది.. ఆ ఎఫెక్ట్ నాపై బాగా పడింది.. ప్రేమలో దెబ్బతినడం వలన పెళ్లిపై పెద్దగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..