AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: మరోసారి తెరపైకి భారతీయుడు 2 వివాదం.. అప్డేట్ పై క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్..

విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి రోజు

Kamal Haasan: మరోసారి తెరపైకి భారతీయుడు 2 వివాదం.. అప్డేట్ పై క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్..
Kamal Haasan
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2022 | 7:06 AM

Share

ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) విక్రమ్ హిట్‏ను ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది (Vikram). విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం తర్వాత కమల్ నటించిన సినిమా ఈ ఏడాదిలో తమిళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా వివాదంపై స్పందించాడు.. విక్రమ్ సినిమా విజయోత్సవంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తాను ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం భారతీయుడు 2.. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ పలు కారణాల వలన తాత్కాలికంగా చిత్రీకరణ ఆగిపోయింది.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఇందుకోసం చిత్రయూనిట్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 షూటింగ్ కంప్లీట్ కాగానే.. భారతీయుడు 2 మూవీ పట్టాలెక్కుతుంది అంటూ చెప్పుకొచ్చారు కమల్.. కమల్, శంకర్ కాంబోలో 1996లో వచ్చిన సంచలన చిత్రం భారతీయుడు సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సిక్వెల్ గా భారతీయుడు 2 మూవీ తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించనప్పిటి నుంచి అంచనాలు భారీగానే నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 2020లో సెట్లో అనుకోకుండా ప్రమాదం జరిగి కొందరు ప్రాణాలు కోల్పోవడం.. ఆ తర్వాత దర్శకనిర్మాతల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఆర్సీ 15 సినిమా చిత్రీకరణలో బిజీ అయ్యారు.. దీంతో అసలు భారతీయుడు 2 సినిమా ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి