Mahesh Babu : మహేష్ సినిమానుంచి బుట్టబొమ్మ తప్పుకుందా.. ? అసలు విషయం ఏంటంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెట్ గా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు సినిమానుంచి వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు.

Mahesh Babu : మహేష్ సినిమానుంచి బుట్టబొమ్మ తప్పుకుందా.. ? అసలు విషయం ఏంటంటే
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2022 | 6:11 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రీసెట్ గా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు సినిమా నుంచి వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహేష్ మాస్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. దాదాపు 11 ఏళ్లతర్వాత వస్తున్న ఈ కాంబో కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జులై మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని అంటున్నారు. గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే తో అరవింద సమేత, అలవైకుంఠపురంలో సినిమాలు చేసిన త్రివిక్రమ్ మరోసారి ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేశారు.

అయితే ప్రస్తుతం పూజా హెగ్డే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతే కాదు రెన్యుమరేషన్ కూడా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ దాంతో రెన్యుమరేషన్ , డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో మహేష్ సినిమానుంచి పూజ హెగ్డే తప్పుకుందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు చిత్రయూనిట్.. పూజా హెగ్డేనే ఈ సినిమాలో హీరోయిన్ అని అంటున్నారు చిత్రయూనిట్. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీలను సంప్రదిస్తున్నారట. ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ చిన్నది మహేష్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుంటుందా..? అందుకే వెంటనే ఓకే చెప్పిందని టాక్. ఈ సినిమాలో మహేష్ శ్రీలీల మధ్య ఓ డ్యూయట్ కూడా ఉంటుందని అంటున్నారు. మహేష్ కెరీర్ లో 28వ మూవీ వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మహేష్ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశాడట ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి