Mega 154: శరవేగంగా మెగా154 షూటింగ్.. మెగాస్టార్ మూవీ సెట్‌లో సందడి చేసిన సుకుమార్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన మెగాస్టార్ ఆయా షూటింగ్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు.

Mega 154: శరవేగంగా మెగా154 షూటింగ్.. మెగాస్టార్ మూవీ సెట్‌లో సందడి చేసిన సుకుమార్..
Mega 154
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2022 | 5:33 PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన మెగాస్టార్ ఆయా షూటింగ్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య(Acharya)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు. ఈ సినిమా మెగా అభిమానులను  నిరాశపరిచింది. అభిమానుల అంచనాలను ఆచార్య సినిమా రీచ్ అవ్వలేక పోయింది. దాంతో ఇప్పుడు మెగాస్టార్ చేస్తున్న సినిమాల పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం చిరు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమా తోపాటు మెహర్ రమేష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు చిరు. ఈ మూవీ తమిళ్ లో అజిత్ నటించిన వేదాళం మూవీకి రీమేక్. ఈ రీమేక్ లో కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వీటితో పటు యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ మాస్ మసాలా మూవీ చేస్తున్నారు మెగాస్టార్.

ఈ సినిమాకు వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా వస్తున్న ఈ సినిమా లో చిరు మత్యకారుడిగా కనిపించనున్నారు. మొన్నామధ్య విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పోస్టర్ మెగాస్టార్ సూపర్ హిట్ ముఠామేస్త్రి సినిమాను గుర్తు చేశాయి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైంది. తాజాగా ఈ సినిమా సెట్ ను సందర్శించారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. చిత్రానికి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు బాబీని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో చిరంజీవి, శ్రుతిహాసన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమానుంచి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు