AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: జక్కన్న క్రియేటివిటికి ప్రపంచమే ఫిదా.. ఇజ్రాయెల్ న్యూస్ పేపర్లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ ఎడిషన్..

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం మరో సెన్సెషన్ క్రియేట్ చేసింది. నెట్టింట ఇప్పుడు కొమురం భీమ్ ఎన్టీఆర్ పై ఓ స్పెషల్ ఎడిషన్‏కు ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

RRR: జక్కన్న క్రియేటివిటికి ప్రపంచమే ఫిదా.. ఇజ్రాయెల్ న్యూస్ పేపర్లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ ఎడిషన్..
Rrr
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2022 | 12:25 PM

Share

ఆర్ఆర్ఆర్ (RRR).. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృషించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. నార్త్ లోనూ ఆర్ఆర్ఆర్ చిత్రం సాలిడ్ హిట్ అందుకుంది. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించాడు.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్, అలియా భట్, ఒలివియా మోరీస్, సముద్రఖని, శ్రియా కీలకపాత్రలలో నటించారు. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తానికి పాన్ వరల్డ్ లెవల్లో ఆర్ఆర్ఆర్ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా.. మరోసారి జక్కన్న క్రియేటివికి ప్రపంచమే ఫిదా అయ్యింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం మరో సెన్సెషన్ క్రియేట్ చేసింది. నెట్టింట ఇప్పుడు కొమురం భీమ్ ఎన్టీఆర్ పై ఓ స్పెషల్ ఎడిషన్‏కు ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అది ఇజ్రాయిల్ దేశానికి చెందిన న్యూస్ పేపర్ గా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ పాత్ర గురించి ఆ దేశ పేపర్ లో స్పెషల్ ఎడిషన్ ప్రచురించినట్లుగా తెలిస్తోంది.. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి
Rrr Ntr

Rrr Ntr

ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. జక్కన్న క్రియేటివి.. తారక్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..