AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: విరాటపర్వం ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?.. నెట్టింట వైరలవుతున్న సరికొత్త అప్డేట్..

1990లో జరిగిన యదార్థ సంఘటనను ప్రేమను జోడించి మహా ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ వేణు ఉడుగుల. ఎన్నో అంచానాల మధ్య జూన్ 17న విడుదలైన ఈ మూవీకి

Virata Parvam: విరాటపర్వం ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?.. నెట్టింట వైరలవుతున్న సరికొత్త అప్డేట్..
Virata Parvam
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2022 | 7:25 AM

Share

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా జంటగా నటించిన విరాటపర్వం (Virata Parvam) థియేటర్లలో సందడి చేస్తుంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సాయి పల్లవి, రానా అద్భుత నటన.. డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విధానంపై ప్రేక్షకులే కాదు.. సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. 1990లో జరిగిన యదార్థ సంఘటనను ప్రేమను జోడించి మహా ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ వేణు ఉడుగుల. ఎన్నో అంచానాల మధ్య జూన్ 17న విడుదలైన ఈ మూవీకి ముందు నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. అయితే సినిమా విడుదలకు ముందే ట్రైలర్, సాంగ్స్, టీజర్, పోస్టర్స్‏తో ఆసక్తిని రేకెత్తించారు మేకర్స్. గతంలోనే విడుదలైన కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడడడంతో..నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ చిత్రాన్ని నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా అనౌన్స్ చేసిన విధంగానే విరాట పర్వం చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయగా.. హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విరాట పర్వం సినిమా గురించి సరికొత్త వార్త ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇక జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అందమైన ప్రేమకావ్యంగా వచ్చిన ఈ సినిమాను ఓటీటీలో మూడు లేదా నాలుగు వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ భావానిస్తున్నారని నెట్టింట వార్త వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నక్సలైట్ రవి శంకర్ అలియాస్ రవన్నగా రానా.. వెన్నెల అనే అమ్మాయి పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, సాయిచంద్, ఈశ్వరీరావు కీలకపాత్రలలో నటించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే