Vikram Collections: విశ్వరూపం చూపించిన కమల్.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విక్రమ్.. మరో రికార్డ్..
మొదటి రోజు నుంటే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ... ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్ (Vikram). జూన్ 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ… ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. చివరలో అతిథి పాత్రలో సూర్య రావడంతో విక్రమ్ మూవీ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. చాలా కాలం తర్వాత వెండితెరపై నట విశ్వరూపం చూపించాడని.. కమల్, విజయ్, సూర్య కలిసి చేసిన సినిమా అదుర్స్ అంటూ నెట్టింట ఫ్యాన్స్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటివరకు అనేక రికార్డ్స్ సృష్టించింది. మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మూడు వారాలు పూర్తిచేసుకుంది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే తమిళంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లు వసూళ్లు చేయగా.. కేవలం తమిళనాడులో మాత్రమే రూ. 140 కోట్ల మార్కును చేరుకుంది. బాక్సాఫీస్ వద్ద అత్యథిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది..
ఇక అదే రోజున విడుదలైన మేజర్ సినిమా సైతం వసూళ్ల వేట కొనసాగిస్తోంది. మేజర్, విక్రమ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే.. విక్రమ్ సినిమా అతి పెద్ద కమర్షియల్ హిట్ అంటూ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.. విక్రమ్, విశ్వాసం, బాహుబలి 2 టీఎన్ గ్రాస్ క్రాస్ చేసి ఆల్ టైమ్ నెంబర్ 1 టీఎన్ గ్రాసర్ కి త్వరలో చేరుకోబోతుంది అంటూ ట్వీట్ చేస్తూ కమల్ ఫోటోను షేర్ చేశారు. దశాబ్దాలుగా సినిమాలపై ఫోకస్ చేయని హీరోయ.. ఇప్పుడు అతి పెద్ద కమర్షియల్ హిట్ అందుకున్నాడు అని అన్నారు.
#Vikram to cross #Viswasam and #Baahubali2 TN Gross to reach All-time No.1 TN Grosser soon.. ?
— Ramesh Bala (@rameshlaus) June 17, 2022
విక్రమ్ సినిమాను ఇంతలా ఆదిరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు కమల్.. ఈ చిత్రాన్ని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళంలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వస్తున్నారు.
For a man who didn’t care about monetary success and focused on good cinema for decades, gets Tamil industry ‘s Biggest commercial hit..#Vikram #Ulaganayagan @ikamalhaasan pic.twitter.com/dOh08aIb6N
— Ramesh Bala (@rameshlaus) June 17, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..