Akira Nandan: మేజర్ సాంగ్కు పియానో ప్లే చేసిన అకీరా.. వైరలవుతున్న వీడియో..
ముఖ్యంగా పియానో వాయించడంలో అకీరా దిట్ట అన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన గ్రాడ్యూయేషన్ డేలో స్కూల్ స్నేహితుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ (Akira Nandan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అకీరాకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటాయి. కేవలం పవర్ స్టార్ తనయుడిగానే కాకుండా.. అకీరా సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అకీరా మల్టీటాలెంటెడ్. కేవలం చదువులోనే కాకుండా.. సంగీతంలో, ఆటలలో మంచి పట్టు సాధించాడు.. ముఖ్యంగా పియానో వాయించడంలో అకీరా దిట్ట అన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన గ్రాడ్యూయేషన్ డేలో స్కూల్ స్నేహితుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటకు పియానోను అద్భుతంగా వాయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది… తాజాగా మరోసారి పియానో వాయించాడు అకీరా.. అడివి శేష్ నటించిన మేజర్ సినిమాలోని హృదయమా పాటకు అద్భుతంగా పియానో వాయించాడు.. ఈ వీడియోను అకీరా తల్లి రేణు దేశాయ్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు.
యంగ్ అండే టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ మూవీకి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేజర్ సందీప్ జీవితంలో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా చూపించిన చిత్రయూనిట్ పై సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. తాజాగా మేజర్ సినిమాలోని ‘హృదయమా’ పాటను! త్రూ తన కీ బోర్డ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు అకీరా. కంపోజ్ చేయడమే కాదు.. ఆ వీడియోను తన బెస్ట్ ఫ్రెండ్ అండ్ హీరో అడివి శేష్ కు పంపించారు. ఇక ఆ వీడియోను ట్వీట్ చేసిన శేష్.. అకీరా బిగ్ బిగ్ థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మరోవైపు అకీరా పియానో వాయిస్తున్న వీడియోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు అడివి శేష్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..