Aadi Saikumar : గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు హీరో.. మళ్లీ తండ్రి కాబోతున్న ఆది సాయికుమార్..
తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ హీరో సాయి కుమార్. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటూ హీరోగా, సహయ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించారు. ప్రస్తుతం యంగ్ హీరోహీరోయిన్లకు తండ్రి పాత్రలు పోషిస్తున్నారు. తండ్రి అడుగు జాడల్లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆది సాయికుమార్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నటులలో సాయి కుమార్ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అలాగే తండ్రి సాయి కుమార్ అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆది సాయి కుమార్. తొలి రెండు సినిమాలతోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆది.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత లవ్లీ మూవీతోనూ మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఆది నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలు తగ్గించిన ఆది.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యాడు. ప్రస్తుతం శంభాల అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా చిత్రీకరణలోనే బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
ఇదెలా ఉంటే.. తాజాగా ఆది సాయికుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను మళ్లీ తండ్రి కాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు తన భార్య, కూతురుతో కలిసి చేతుల ఫోటో షేర్ చేస్తూ త్వరలోనే ముగ్గురం నలుగురం కాబోతున్నామంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ దంపతులకు సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
ఆది సాయికుమార్.. 2014లో అరుణ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కూతురు పుట్టింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్నాడు ఆది. వచ్చే ఏడాది జనవరిలో తమ కుటుంబంలో మరో కొత్త మెంబర్ రాబోతున్నారని… తాము ముగ్గురం నుంచి నలుగురం కాబోతున్నామని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దీంతో నెటిజన్స్ విషెస్ తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..




