AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laal Singh Chaddha: అమీర్‌కు షాక్ ఇచ్చిన ”లాల్ సింగ్ చడ్డా”.. కొత్త చిక్కుల్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

Laal Singh Chaddha: అమీర్‌కు షాక్ ఇచ్చిన ''లాల్ సింగ్ చడ్డా''.. కొత్త చిక్కుల్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
Lal Singh Chaddha
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2022 | 5:01 PM

Share

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha) సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అమీర్ ఈ సినిమాలో మూడు డిఫెరెంట్ గెటాప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో మన యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. బోడి బాలరాజు పాత్రలో చైతన్య నటించి ఆకట్టుకున్నారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సిఫీస్ దగ్గర లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణంగా నిరాశపరిచింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అమీర్ చాలా కష్టపడ్డారు. అయితే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి.

గతంలో అమీర్ చేసిహ్న వ్యాఖ్యలు ఈ సినిమాకు చాలా మైనస్ అయ్యాయి. ఈ దేశ విడిచి పెళ్లిపోవలని ఉంది అంటూ అమీర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఇప్పుడు లాల్ సింగ్ సినిమా సందర్భంగా మరోసారి వారు అమీర్ పై  ఫైర్ అవ్వడం.. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేయడం సినిమా ఫ్లాప్ కు ఓ కారణమైంది. ఇదిలా ఉంటే లాల్ సింగ్ చడ్డా సినిమా డిజాస్టర్ గా నిలవడంతో బయ్యర్లు ఆందోళన చేస్తున్నారని తెలుస్తోంది. అమీర్ సహ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమా పరాజయానికి తనే స్వయంగా బాధ్యత వహించాడు. డిస్టిబ్యూటర్స్ నష్టపోకుండా ఉండేలా అమీర్ చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఓపినింగ్స్ బాగానే వచ్చాయి. కానీ క్రమక్రమంగా వసూళ్లు పడిపోవడం మొదలైంది. ఇక లాల్ సింగ్ చద్దా పూర్తి రన్ ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్కు కంటే తక్కువగా వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి