Mahesh Babu: ‘ఇలా ఉంటే ప్రపంచంలో ఏ అమ్మాయికి అన్నయ్య కాలేవు’.. మహేష్ న్యూలుక్ చూస్తే మతిపోవాల్సిందే..
ఎప్పటికప్పుడు స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులకు షాకిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం రఫ్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లో స్టైలిష్ గా కనిపించిన మహేష్.. ఇప్పుడు క్యూట్ అండ్ చార్మింగ్ లుక్ లో మెరిసిపోతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలనాటి హీరో కృష్ణ నటవారసుడిగా చిత్రపరిశ్రమలోకి బాల్యనటుడిగా అరంగేట్రం చేసిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల మనసులను చేరుకున్నాడు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట హిట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లోచ్చిన మహేష్.. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మహేష్ కు సంబంధంచిన న్యూలుక్స్ వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులకు షాకిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం రఫ్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లో స్టైలిష్ గా కనిపించిన మహేష్.. ఇప్పుడు క్యూట్ అండ్ చార్మింగ్ లుక్ లో మెరిసిపోతున్నారు.
నాలుగు పదుల వయసులోనూ టీనేజ్ యువకుడిగా క్యూట్ అండ్ చార్మ్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు మహేష్. తన ఫిట్ నెస్ ట్రైనర్ తో కలిసి దిగిన ఫోటో న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సిద్దమవుతున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.