Akkineni Nagarjuna: మరోసారి తనయుడితో కలిసి నటించనున్న నాగార్జున.. కానీ
అక్కినేని నాగార్జున ఇటీవలే బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ది గోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)ఇటీవలే బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ది గోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా విభిన్న కథతో తెరకెక్కుతోందనని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమానుంచి త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్ .. అయితే నాగార్జున మరోసారి తన తనయుడితో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. గతంలో నాగార్జున నాగచైతన్యతో కలిసి మనం, బంగార్రాజు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు చైతూతో కాదట నాగ్ నటించేది. ఈసారి నాగరాజును అఖిల్ తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది.
నాగార్జున , అఖిల్ కాంబినేషన్ లో త్వరలోనే సినిమా రానున్నదని టాక్ వినిపిస్తోంది. గోస్ట్ సినిమా తర్వాత నాగార్జున మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేయనున్నారని టాక్. ప్రస్తుతం మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కిస్తోన్న మోహన్ రాజా.. నాగార్జున కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేశారట. ఈ సినిమాలో నాగ్ తో పాటు అఖిల్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. వచ్చే నెలలో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాగ్ , అఖిల్ కలిసి నటించనున్నారన్న వార్త అక్కినేని అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. మరి ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలిసిల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.