Mahesh Babu: రాముడిగా మహేష్ బాబు.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫోటో..

గతేడాది ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో పాల్గోన్న సమయంలోనే తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని.. అది కూడా గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Mahesh Babu: రాముడిగా మహేష్ బాబు.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫోటో..
Mahesh Babu As Rama
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2023 | 12:02 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు జక్కన్న. గతేడాది ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో పాల్గోన్న సమయంలోనే తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని.. అది కూడా గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని.. ఇది పాన్ ఇండియా కాకుండా.. గ్లోబల్ స్థాయిలో నిర్మించే చిత్రమని అందుకే ఈ మూవీ కోసం మహేష్ బాబును ఎంపిక చేసినట్లు గతంలోనే రైటర్ విజయేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని కూడా తెలియజేశారు. అయితే ఈ సినిమాలో మహేష్ పాత్ర హనుమాన్ స్పూర్తితో ఉంటుందని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. అడవుల బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ చిత్రంలోని మహేష్ రోల్ భిన్నంగా ఉంటుందని.. అడవిలో అన్ని అసమానతలతో పోరాడిన చరిత్ర కలిగిన హనుమాన్ పాత్ర స్పూర్తి అని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఏడాది చివర్లో ఈ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో రాముడిగా మారిన మహేష్ ఫోటో తెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబును రాముడిగా ఊహించుకుంటూ ఓ అభిమాని డిజిటల్ ఆర్ట్ క్రియేట్ చేశారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణంలో మహేష్ రాముడిగా నటించాల్సి వస్తే బహుశా ఇలాగే ఉంటాడేమో.. అంటూ షేర్ చేశాడు. అతను చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరలయ్యింది. రాముడిగా మహేష్ బాబును చూసి సూపర్.. మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.