Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 Years for Pokiri: మహేష్ మాస్‌ యాక్షన్‌ మూవీ ‘పోకిరి’లో ఫస్ట్ హీరోయిన్‌గా అనుకున్నది వీరినే..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు.

16 Years for Pokiri: మహేష్ మాస్‌ యాక్షన్‌ మూవీ 'పోకిరి'లో ఫస్ట్ హీరోయిన్‌గా అనుకున్నది వీరినే..
Mahesh Babu Pokiri
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 28, 2022 | 4:20 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu) నటించిన పోకిరి( Pokiri) సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannath )దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. ఇప్పటికీ పోకిరి సినిమా సృష్టించిన రికార్డ్స్ కొన్ని పదిలంగానే ఉన్నాయి. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మహేష్ ను ఒక్కసారిగా మాస్ హీరోగా మార్చింది ఈ సి సినిమా నేటికి ఈ బ్లాక్ బస్టర్ హిట్ రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ మూవీలో మహేష్ సరసన  ఇలియానా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా 16 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పోకిరి సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మహేష్ మాస్ యాక్షన్ తో పాటు.. ఇలియానా అందాలు ఈ సినిమా హైలైట్ అనే చెప్పాలి. అయితే ఇలియానా కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా వేరే భామలను అనుకున్నారట దర్శకుడు పూరిజగన్నాథ్.

పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా బాలీవుడ్ బ్యూటీ ఆయాశా టాకియా ను హీరోయిన్ గా కనుకున్నారట. ఈ అమ్మడు 2005 లో పూరీ తెరకెక్కించిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఆయేషా మరే తెలుగు సినిమాలో నటించలేదు. బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమాలు చేసింది. ఆ తర్వాత పొడుగుకాళ్ల సుందరి పార్వతి మిలిటన్ ను హీరోయిన్ గా అనుకున్నారట. అదికూడా కుదరలేదు. ఆ తర్వాత ఈ చిన్నది మహేష్ నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. అలాగే పోకిరి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెను కూడా సంప్రదించారట. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె కూడా ఈ సినిమాలో నటించలేదు.  కంగనా రనౌత్ ను కూడా పోకిరి సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అది కూడా కుదరలేదు. దాంతో మహేష్ సరసన నటించే అవకాశం ఇలియానాకు వచ్చిందట. పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇలియానాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆతర్వాత ఈ జీరో సైజ్ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‏కు సపోర్ట్‏గా ఆర్జీవీ ట్వీట్..

Happy Birthday Samantha : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. క్వీన్ ఆఫ్ హార్ట్స్‏గా నిలబెట్టిన సినిమాలు ఇవే..