Film: తీసింది రూ.15 కోట్లతో.. కొల్లగొట్టింది రూ.800 కోట్లు.. రికార్డులు అన్నీ బద్దలు
కొన్ని సినిమాలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వచ్చి.. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడతాయి. ఈ మూవీ ఆ కోవకు చెందినదే. రూ.15 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా రూ.800 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది.. ఓ 16 ఏళ్ల అమ్మాయి అంటే నమ్ముతారా....?

సైలెంట్‌గా వచ్చి.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటాయి. హైప్ లేకుండా రిలీజయ్యి.. ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమా గురించి మీకు వివరించబోతున్నామ్. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. చివరకు ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టింది. 16 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే ఆ సినిమా నేమ్ సీక్రెట్ సూపర్ స్టార్. దాదాపు 8 సంవత్సరాల కింద వచ్చిన ఈ చిత్రం.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. అద్వైత్ చందర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు కీలక పాత్ర పోషించాడు. జైరా వసీం పాత్ర ఈ మూవీలో ఎంతో కీలకం. గాయని అవ్వాలనే కలతో.. ఓ యుక్త వయస్సు అమ్మాయి బురఖా ధరించి.. పాటలు పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంది. సమాజంలోని చాలా మూడ కట్టుబాట్లకు ఎదరెళ్తుంది. తన తల్లిని కూడా నరకప్రాయమైన వైవాహిక జీవితం నుంచి విముక్తి కల్పించి.. కొత్త జీవితంవైపు అడుగులు వేసేలా చేస్తుంది. చాలా ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాలో బలమైన మెసేజ్ కూడా ఉంటుంది. అందుకే సినిమా అంత సెన్సేషనల్ హిట్ అయింది.
లీడ్ రోల్ చేసిన జైరా వసీం పాత్రకు ప్రాణం పోసింది. తన అమోఘమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ సినిమాకుగాను తను ఫిల్మ్ ఫేర్‌తో పాటు చాలా అవార్డులు దక్కించుకుంది. ఆమె స్టార్ డమ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లింది. అయితే ఆమె కెరీర్ మంచి పీక్ సమయంలో ఉండగా.. 2019లో కేవలం 18 ఏళ్ల వయసులోనే నటనకు వీడ్కోలు పలికింది. తన జీవన విధానం, ఆధ్యాత్మిక చింతను ఇబ్బంది కలుగుందని చెప్తూ.. వెండితెరకు దూరమైంది.
ఇక ఈ సినిమాకు మన దేశంలో రూ.60 కోట్ల వరకు కలెక్షన్లు వస్తే.. చైనాలో రూ.750 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. మిగితా అన్ని దేశాల్లో కలిపి రూ.40 కోట్లవరకు కలెక్షన్లు వచ్చాయి. అలా మొత్తంగా రూ.850 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




