Dil Raju: దిల్ రాజు సక్సెస్ టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమా..? నెట్టింట సరికొత్త చర్చ..
Dil Raju: దిల్ రాజు అంటే సక్సెస్.. సక్సెస్ అంటే దిల్ రాజు అన్నంతలా ఉంటుంది. ఈ నిర్మాత ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు...
Dil Raju: దిల్ రాజు అంటే సక్సెస్.. సక్సెస్ అంటే దిల్ రాజు అన్నంతలా ఉంటుంది. ఈ నిర్మాత ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. దిల్‌రాజు పేరు చూసి సినిమాకు వెళ్లే వారు ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ స్టార్ ప్రొడ్యూసర్ సక్సెస్ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమా.? అనే సరికొత్త చర్చ మొదలైంది. అసలు విషయమేంటంటే..
దిల్ రాజు సక్సెస్ కేవలం టాలీవుడ్ వరకే అని నార్త్ ఇండియాకు చెందిన సినీ విమర్శకులు పెదవి విరుస్తున్నారు. హిందీలో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన రెండు సినిమాల ఫలితాలే దీనికి నిదర్శమని చెబుతున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కించిన రెండు సినిమాల్లో దిల్ రాజు భారీగా నష్టపోయారు అంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు బాలీవుడ్‌లో మాత్రం ఆ పేరును సంపాదించుకోలేక పోతున్నారు. అల్లు అరవింద్‌తో కలిసి తను ప్రొడ్యూస్ చేసిన జెర్సీ సినిమాతో నస్టాన్ని మూటగట్టుకున్నారు. తెలుగు హిట్ సినిమా జెర్సీకి రిమేక్ గా.. సేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.. స్టార్ హీరో షాహిద్ కపూర్ కాంబోలో తెరకెక్కినప్పటికీ.. పోస్ట్ కోవిడ్ పరిస్థితులు ఈసినిమాను గట్టిగా దెబ్బేశాయి. ఇక తాజాగా రిలీజైన ‘హిట్’ సినిమ కూడా.. దిల్ రాజు హిట్ ట్రాక్ పై మాయని మచ్చ పడేలా చేసింది.
ఇక తాజాగా బాలీవుడ్‌లో విడుదలైన హిట్‌సినిమా కూడా బాక్సాఫీస్ ముందు భారీ డిజాస్టర్ గా నిలిచింది. జెర్సీ సినిమాలాగే.. దిల్ రాజుకు గట్టి దెబ్బేసింది. తెలుగు హిట్ సినిమాకు రిమేక్ గా.. సేమ్ డైరెక్టర్ శైలేష్ డైరెక్షన్లో.. రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటి వరకు కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 15 కోట్ల వరకు వస్తాయనుకున్న మేకర్స్ అంచనాలకు ఒక్క సారిగా తలకిందులు చేశాయి. మరి సక్సెస్‌కు మారుపేరుగా నిలిచిన దిల్‌రాజు బాలీవుడ్‌లో తన సత్తా ఎప్పుడు చాటుతారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..