Singer Geetha Madhuri: ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వొద్దు.. ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన సింగర్

సైబర్ నేరగాళ్ల ఆటలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. నెటిజన్లను మోసపోయేలా చేస్తున్నాయి. అయితే సైబర్‌ పోలీస్‌ విభాగం ఇలాంటి మోసాలపై ఎంత అవగాహన కల్పించినా.. నెటిజన్లు మాత్రం జాగ్రత్తగా ఉండడం లేదు.

Singer Geetha Madhuri: ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వొద్దు.. ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన సింగర్
Geetha Madhuri
Follow us

|

Updated on: Jul 19, 2022 | 8:45 PM

సైబర్ నేరగాళ్ల ఆటలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. నెటిజన్లను మోసపోయేలా చేస్తున్నాయి. అయితే సైబర్‌ పోలీస్‌ విభాగం ఇలాంటి మోసాలపై ఎంత అవగాహన కల్పించినా.. నెటిజన్లు మాత్రం జాగ్రత్తగా ఉండడం లేదు. తీరా మోసపోయాక.. పోలీసులను వేడుకోవడం ఏమాత్రం ఆపడం లేదు. ఇక సెలబ్రిటీల పేరుతో మోసం చేస్తున్న కేటుగాళ్లు హద్దులు మీరుతున్నారు. ఫారెన్ నెంబర్‌తో.. సెలబ్రిటీల ఫోటోలతో.. వాట్సాప్‌ చాట్‌లు చేస్తున్నారు.. అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. వారి వారి పర్సనల్ డాటాను కూడా రాబడుతున్నారు. అలా తాజాగా తన పేరుతో సైబర్‌నేరగాళ్లు వాట్సాప్ చాట్‌ చేస్తున్నారని అందర్నీ వార్న్‌ చేశారు స్టార్ సింగర్ గీతామాధురి(Geetha Madhuri).

ఇండస్ట్రీలో మాస్ అండ్ క్లాస్‌ సాంగ్స్‌తో పాపులర్ అయ్యారు స్టార్ గీతామాధురి. ఆ తరువాత హీరో నందును పెళ్లి చేసుకుని అటు మ్యారీడ్‌ లైఫ్లోను ఇటు సింగింగ్ కెరీర్‌ లోనూ బిజీగా మారియారు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చి.. రన్నరప్ గా నిలిచారు. బుల్లి తెరపై విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సినిమాలకు పాడేస్తూ.. అంచలంచెలుగా ఎదుగుతున్నారు. ఈక్రమంలోనే తన పేరు మీదు ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్నాయాని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు గీతామాధురి. తన ప్రొఫైల్ పిక్ ఉన్న ఓ అమెరికా నెంబర్‌తో వాట్సాప్‌ మెసేజులు వస్తున్నాయని.. ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వద్దని తన ఫ్యాన్స్ ను కోరారు. ఇక ఇప్పటికే వాట్సాప్‌ చాటింగులు చేస్తున్న వారు వెంటనే ఆ నెంబర్‌ను బ్లాక్‌ చేయాలని సూచించారు. ఇక ఇదే విషయాన్ని సైబర్ పోలీసుల దృష్టికి కూడా తీసుకెళుతున్నట్టు ఆమె చెప్పారు. ఇక ఇంతకు ముందు సింగర్ సునీత, రమ్య బెహ్రా విషయంలోనూ ఇదే జరిగింది. ఈస్టార్ సింగర్స్‌ ప్రొఫల్ పిక్ ఉన్న నెంబర్‌తో ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి వాట్సాప్‌ మెసేజులు వెళ్లాయి. అయితే ఇది సైబర్ నేరగాళ్ల పని అని ఎవరూ ఆ మెసేజులకు రెస్పాండ్ అవ్వద్దని వారు సోషల్ మీడియాలో చెప్పడంతో.. అవి ఆగిపోయాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Latest Articles
"మే"లో విడుదలకు సిద్ధమవుతున్న చిన్న సినిమాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రధాని మోదీ మనోగతం ఇదే..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రధాని మోదీ మనోగతం ఇదే..
ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలు ఖరారు.. టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలు ఖరారు.. టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడంటే?
గ్రేటర్ హైదరాబాద్‎లో నీటి కొరత.. వీటికి పెరుగుతున్న ఫుల్ డిమాండ్.
గ్రేటర్ హైదరాబాద్‎లో నీటి కొరత.. వీటికి పెరుగుతున్న ఫుల్ డిమాండ్.
ఉన్నట్టుండి గాల్లో తేలియాడిన బాలిక..ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి
ఉన్నట్టుండి గాల్లో తేలియాడిన బాలిక..ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి
ఎక్కడ విన్నా పుష్పరాజ్‌ పాటే..అసల తగ్గేదేలే
ఎక్కడ విన్నా పుష్పరాజ్‌ పాటే..అసల తగ్గేదేలే
RRతో మ్యాచ్.. టాస్ గెలిచిన SRH.. జట్టులోకి మరో డేంజరస్ ప్లేయర్
RRతో మ్యాచ్.. టాస్ గెలిచిన SRH.. జట్టులోకి మరో డేంజరస్ ప్లేయర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..