Jai Bhim Movie: జై భీమ్‌ వివాదంపై చెన్నై కోర్టు కీలక తీర్పు.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు..

Jai Bhim Movie: సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం 'జై భీమ్‌'. నేరుగా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న...

Jai Bhim Movie: జై భీమ్‌ వివాదంపై చెన్నై కోర్టు కీలక తీర్పు.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు..
Follow us

|

Updated on: Jul 20, 2022 | 6:40 AM

Jai Bhim Movie: సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జై భీమ్‌’. నేరుగా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న అన్యాయాలపై ఎదురించి అభాగ్యులకు అండగా ఉన్న జెస్టిస్ వైవీ చండ్రచూడ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు ఎంత పేరు వచ్చిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టు ముట్టాయి. ఈ క్రమంలోనే హిందూ వన్నియార్ల సామాజిక వర్గం తమ మనోభావాలు దెబ్బతినే విధంగా జై భీమ్‌ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

హీరో సూర్య, నిర్మాత జ్యోతిక, డైరెక్టర్ జ్ఙానవేల్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. హీరో సూర్యతో పాటు ఇతరులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వెలచ్ఛేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ రద్దు చేయాలని కోరుతూ జైభీమ్‌ చిత్ర యూనిట్‌ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ క్రమంలోనే సోమవారం విచారించిన న్యాయమూర్తి సతీష్‌ కుమార్‌ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ కేసు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..