Lavanya tripathi: బ్లాక్ కలర్ డ్రస్‌లో మైండ్ బ్లాక్ చేసే లావణ్యం.. వైరల్ అవుతోన్న ఫోటోలు
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi). హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య నటన, క్యూట్ నెస్ ప్రేక్షుకులను కట్టిపడేసింది. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇక ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతోంది లావణ్య త్రిపాఠి. దాదాపు టాలీవుడు కుర్ర హీరోలందరి సరసన నటించింది ఈ వయ్యారి భామ. అలాగే నాగార్జున లాంటి సీనియర్ హీరో సరసన కూడా నటించింది. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోయిన్ గ నటించింది లావణ్య.
ఇక ఇటీవలే ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హ్యాపీ బర్త్ డే సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించగా.. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో నటించారు. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో లావణ్య అందాలు నెట్టింట వైరల్ అవుతున్నాLavanya Tripathiయి. ఈ ఫొటోలతో పాటు బ్లాక్ కలర్ ను ఇంతవరకు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఎవ్వరూ అనలేదు అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం లావణ్య చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
View this post on Instagram