Disha Patani: ఈ అమ్మడితో జర జాగ్రత్త.. హీరోలను తలదన్నేలా ఫీట్లు చేస్తోన్న ముద్దుగుమ్మ

హీరోయిన్లు నటనతో పాటు ఫిట్నెస్ పై ఎక్కువ ద్రుష్టి పెడుతూ ఉంటారు. రోజులో సగం షూటింగ్స్ తో గడుపుతూ.. మిగిలిన సమయం జిమ్ లో చమట్లు చిందిస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు సన్నజాజులుగా కనిపించేందుకు తెగ కష్టపడుతుంటారు.

Disha Patani: ఈ అమ్మడితో జర జాగ్రత్త.. హీరోలను తలదన్నేలా ఫీట్లు చేస్తోన్న ముద్దుగుమ్మ
Disha Patani
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 19, 2022 | 3:27 PM

హీరోయిన్లు నటనతో పాటు ఫిట్నెస్ పై ఎక్కువ ద్రుష్టి పెడుతూ ఉంటారు. రోజులో సగం షూటింగ్స్ తో గడుపుతూ.. మిగిలిన సమయం జిమ్ లో చమట్లు చిందిస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు సన్నజాజులుగా కనిపించేందుకు తెగ కష్టపడుతుంటారు. నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ తో ఉంటారు. ఇక బాలీవుడ్ లో ఫిట్ నెస్ ఫ్రీక్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు దిశాపటాని(Disha Patani). ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఈ బ్యూటీ తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది.

ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది దిశాపటాని. ఇక బాలీవుడ్ కుర్ర హీరో టైగర్ ష్రాఫ్ తో ఈ బ్యూటీలో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట చట్టపట్టాలేసుకు తెగ తిరుగుతూ చాలా సార్లు మీడియా కంట పడ్డారు. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో పాటు జిమ్ లో కసరత్తులు చేస్తోన్న వీడియోలను తెగ షేర్ చేస్తూ ఉంటుంది దిశాపటాని. తాజాగా దిశాపటాని షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దిశా పాటని గాలిలో గిరగిరా తిరుగుతూ ఫీట్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఏ విలన్ రైటర్స్ సినిమాలో నటిస్తోంది దిశాపటాని.అర్జున్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..