Director srinuvaitla: టాలీవుడ్లో మరో జంట విడాకులు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ భార్య ?..
ఇక ఈ క్రమంలోనే తన కెరీర్ బిగినింగ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'ఢీ' సినిమాను రిమేక్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు శ్రీను వైట్ల. మంచు విష్ణు కోరిక మేరకు స్క్రిప్ట్ వర్క్ అంతా ఫినిష్ చేసి
సినీ పరిశ్రమలో ఇటీవల విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. చిన్న చిన్న పొరపాట్లు.. అభిప్రాయబేధాలతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఎంతో అనోన్యంగా ఉండే జంటలు సైతం విడాకులు తీసుకుని షాకిస్తున్నారు. ఇప్పటికే సమంత నాగచైతన్య, ధనుష్ ఐశ్వర్య, అమీర్ ఖాన్ కిరణ్ వంటి ప్రముఖులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీ కపూల్స్ డివోర్స్ తీసుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారారనే వార్తలు ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి సెలబ్రిటీల జాబితాలోకి చేరేందుకు రెడీగా ఉన్నారు స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల, ఆయన భార్య రూప. ఫ్యామిలీ కథల్లో కామెడీని.. యాక్షన్ ని సమపాళ్లలో మిక్స్ చేసి సినిమాలు తీసే డైరెక్టర్ శ్రీను వైట్ల. ఇక ఇదే ఫార్ములాతో.. స్టార్ హీరోలకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఈ డైరెక్టర్ .. రీసెంట్ డేస్లో మాత్రం కాస్త సైలెంట్ అయిపోయారు. హిట్ ఇచ్చి చాలా యేళ్లు అయిపోతుండడంతో.. సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నారు. మంచి కమ్ బ్యాక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకోసం 24/ 7 కష్టపడుతున్నారు. కొత్త కొత్త కథల కోసం.. తనతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చే మేకర్స్ కోసం విపరీతంగా వెతుకుతున్నారు.
ఇక ఈ క్రమంలోనే తన కెరీర్ బిగినింగ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఢీ’ సినిమాను రిమేక్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు శ్రీను వైట్ల. మంచు విష్ణు కోరిక మేరకు స్క్రిప్ట్ వర్క్ అంతా ఫినిష్ చేసి.. రీసెంట్ గా సెట్స్ మీదికి కూడా వెళ్లారు. కానీ ఏమైందో ఏమో కాని.. మధ్యలోనే ఈ సినిమా షూట్‌ను ఆపేశారు. ఇక అప్పటి నుంచి అంతగా మీడియా ముందుకు రాని ఈ డైరెక్టర్… విడాకుల న్యూస్ తో నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు.
ఇక శ్రీనువైట్ల సినిమాల్లోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన రూప.. ఫ్యాషన్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో వెల్ నోన్ ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయారు. అయితే తాజాగా ఈమె తన భర్త శ్రీను వైట్ల నుంచి విడిపోయేందుకు నిర్ణయించుకున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు శ్రీనువైట్ల కూడా ఓకే చెప్పారని. వీరిద్దరు తాజాగ నాంపల్లి కోర్టును కూడా ఆశ్రయించారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఇంతకు ముందు కూడా శ్రీను వైట్లతో విడిపోవాలని రూప అనుకున్నారు. కానీ రూప తల్లితండ్రులు జోక్యం చేసుకోవడంతో.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు మాత్రం విడాకులకు సిద్దమైపోయారు. ఇక ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుండంతో.. శ్రీను వైట్లకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.