Pushpa 2: పుష్ప 2లో ఆ బాలీవుడ్ విలక్షణ నటుడు.. మరో పవర్‏ఫుల్ పాత్ర కోసం మనోజ్..

ఇప్పటికే ఈ మూవీలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప 2 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదెంటంటే..

Pushpa 2: పుష్ప 2లో ఆ బాలీవుడ్ విలక్షణ నటుడు.. మరో పవర్‏ఫుల్ పాత్ర కోసం మనోజ్..
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 19, 2022 | 7:49 AM

బాక్సీఫీస్ వద్ద పుష్ప (Pushpa) సృష్టించిన సెన్సెషన్ గురించి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో భారీగా వసూళ్లు సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో పుష్పరాజ్ పాత్రలో నటించారు బన్నీ. పుష్ప మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో పుష్ప 2పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ చివరి వారంలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప 2 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదెంటంటే..

ఎన్నో అంచనాలు నెలకొన్న పుష్ప 2లో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కీలకపాత్రలో నటించనున్నాడట. ఇందులో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని..ఆ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని తెలుస్తోంది. దీంతో పుష్ప 2 పై మరింత హైప్ పెరిగింది. సాధారణ కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ డాన్ గా పుష్ప రాజ్ ఎలా ఎదిగాడు అనేది మొదటి పార్ట్ లో చూపించగా.. ఇక పుష్పరాజ్ రూల్ చేయడం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటించగా.. సునీల్, అనసూయ ముఖ్య పాత్రలు పోషించారు. కేవలం పుష్ప సినిమా మాత్రమే కాకుండా ఇందులోని పాటలు సైతం సోషల్ మీడియాను షేక్ చేశాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.