AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతకు అరుదైన గౌరవం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సామ్..

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‏కు ముఖ్య అతిథిగా వెళ్లేందుకు ఆమెకు ఆహ్వానం అందింది.

Samantha: సమంతకు అరుదైన గౌరవం..  ఆసక్తికర కామెంట్స్ చేసిన సామ్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2022 | 7:21 AM

Share

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో పాన్ ఇండియా స్టార్‏గా మారింది అగ్రకథానాయిక సమంత (Samantha). ఇందులో రాజీ పాత్రతో సౌత్, నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇటీవల పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రెటీ సైతం ఈ పాటకు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా..ఖుషి, యశోద సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. తాజాగా సామ్ అరుదైన గౌరవం అందుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‏కు ముఖ్య అతిథిగా వెళ్లేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. ఆగస్ట్ 12 నుంచి ఈ పండగ ప్రారంభంకానుంది. కరోనా సంక్షోభంతో వాయిదా పడిన ఈ ఫెస్టివల్.. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమవుతుంది. ఈ ఫెస్టివల్ లో సామ్ తన కెరీర్, నటన, పరిశ్రమతో అనుబంధనం లాంటి విషయాలను పంచుకోనున్నారు.

ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. ” గతేడాది IFFM భాగమయ్యాను. ఇక ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిద్యం వహించడం నాకు గర్వంగా ఉంది. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారతీయ సినిమాలను, భారతీయులు, సినీ ప్రేమికులు, ఇతరులందరిని ఇలా ఒక్కచోట చేర్చడం అనేది ఒక గొప్ప అనుభూతి.” అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ స్టేట్ రాజధాని నగరంలో సామ్ సినీ ప్రియులను కలవనుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..