Viral Photo : పట్టిపట్టి చూస్తే కనిపెట్టడం కష్టమేమికాదండోయ్.. ఈ అమ్మడు ఎవరో తెలిసిందా..?
ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాను తెగ ఉపయోగించుకుంటున్నారు. తక్కువ సినిమాలు చేసిన సోషల్ మీడియాతో తెగ క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు.
Viral Photo : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాను తెగ ఉపయోగించుకుంటున్నారు. తక్కువ సినిమాలు చేసిన సోషల్ మీడియాతో తెగ క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. సినిమా విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. అంతే కాదు హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను నిద్రపోనివ్వడం లేదు కొందరు భామలు. అంతేకాదు చిన్ననాటి ఫోటోలను, మొఖాలు దాచున్న క్రేజీ ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేసి సందడి చేస్తున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫొటో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందంగా నవ్వుతూ మొఖానికి చేతిని అడ్డుపెట్టుకున్న ఈ భామ ఎవరో గుర్తుపట్టారా..? పట్టిపట్టి చూస్తే కనిపెట్టడం కష్టమేమి కాదు..
ఇంతకు ఈ అమ్మడు ఎవరో కాదు.. ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ గా రాణించిన మీరా జాస్మిన్. ఈ అమ్మడు ఒకానొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేస్ లో ముందుండేది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులను అలరించింది మీరా జాస్మిన్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ మీరా జాస్మిన్ సినిమాలు చేసింది. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. ఇక ఇటీవల ఐ యమ్ బ్యాక్ అంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద దుమారమే రేపింది. హీరోయిన్ గా కంటిన్యూ అయిన టైం లో స్కిన్ షో చేయని మీరా ఇప్పుడు తన అందాలతో కుర్రాళ్ల మతులుపోగొడుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో అదరగొడుతోంది. త్వరలోనే ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
View this post on Instagram