AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen: లలిత్ మోదీతో డేటింగ్‌‌పై.. ఫస్ట్‌ టైం స్పందించిన సుస్మిత

మాజీ విశ్వసుందరనే ట్యాగు.. సినిమాల్లో హీరోయిన్ గా క్రేజు.. ఎవర్‌గ్రీన్‌ మోడల్‌గా కితాబు..! ఇవన్నీ ఉన్నా కూడా.. తన పర్సనల్ లైఫ్లో మాత్రం..

Sushmita Sen: లలిత్ మోదీతో డేటింగ్‌‌పై.. ఫస్ట్‌ టైం స్పందించిన సుస్మిత
Sushmita Sen, Lalith Modi
Ravi Kiran
|

Updated on: Jul 18, 2022 | 9:17 PM

Share

మాజీ విశ్వసుందరనే ట్యాగు.. సినిమాల్లో హీరోయిన్ గా క్రేజు.. ఎవర్‌గ్రీన్‌ మోడల్‌గా కితాబు..! ఇవన్నీ ఉన్నా కూడా.. తన పర్సనల్ లైఫ్లో మాత్రం ఫర్‌ఫెక్ట్ గా ఉండలేకపోతున్నారు సుస్మితా సేన్. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచినా కూడా.. తనతో చివరి వరకు వెన్నంటి నడిచే తోడును మాత్రం పట్టుకోలేకపోతున్నారు. చాలా మంది సెలబ్రిటీలతో డేటింగ్ చేసినా.. కూడా డీసెంట్‌గా తాళి మాత్రం కట్టించుకోలేకపోతున్నారు. ఇక ఇదే విసయంలో నెట్టింట విమర్శలు వస్తున్నా కూడా.. అసలే మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవారు. అయితే అది ఐపీఎల్ ఫౌండర్ కమ్‌ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ని కలవనంత వరకు.!

ఎప్పుడైతే.. లలిత్ మోదీ ‘సుస్మితా సేన్‌లో ప్రేమను కనిపెట్టా’ అంటూ.. తన ఇన్టప్టా బయోలో మెన్షన్ చేశారో.. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారో.. అప్పటి నుంచే ఈ సుందరి నెట్టింట విపరీతంగా బజ్‌ అయిపోయారు. ట్రోల్స్, మీమ్స్ వైరల్ అయ్యారు. అంతేకాదు డబ్బుకోసమే ముసలివాడైన లలిత్ మోదీని డేట్ చేస్తున్నారంటూ.. కామెంట్స్ ఎదుర్కొన్నారు. ‘గోల్డ్ డిగ్గర్’ అనే ట్యాగ్‌ను కూడా సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ పై..! లలిత్ మోదీతో తాను చేస్తున్న డేటింగ్‌పై ..! వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు సుస్మిత.

“మన చుట్టూ ఉన్న ప్రపంచం దయనీయంగా మారుతోంది. అది చూస్తుంటే బాధగా ఉంది. కొంతమంది మేధావులు, గాసిప్స్‌ క్రియేట్‌ చేసే అమాయకులు, ఇప్పటివరకూ నన్ను కలవని స్నేహితులు, నాతో పెద్దగా పరిచయంలేని వ్యక్తులు.. ఇలా ప్రతిఒక్కరూ నా జీవితం, వ్యక్తిత్వంపై తమ అమూల్యమైన అభిప్రాయాలు బయటపెడుతున్నారు. నేనొక ‘గోల్డ్‌ డిగ్గర్‌’నని డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నానంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు బంగారం కంటే వజ్రాలంటేనే ఎక్కువ ఇష్టం. వాటిని నేను కొనుక్కోగలను కూడా. ఇన్ని విమర్శలు వస్తున్నా నాకు అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, స్నేహితులకు ధన్యవాదాలు. దయచేసి అందరూ ఒక విషయం తెలుసుకోండి.. మీ సుష్‌ బాగానే ఉంది. ఎందుకంటే తాత్కాలిక మెప్పు కోసం నేను జీవించను” అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు.. మరోసారి సెల్ప్‌ మేడ్‌ ఉమెన్‌గా తనను తాను చెప్పుకునే ప్రయత్నం చేశారు సుస్మిత.