AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: వర్మ మూవీకి దెబ్బ.. మరో నిర్మాతను మోసం చేసినందుకు శిక్ష..

తిమ్మిన బమ్మి చేయాలన్నా.. బమ్మిని తిమ్మి చేయాలన్నా.. గట్టిగా మాట్లాడితే సరిపోతుంది. అందులోనూ మేధావినన్న ఫిలింగ్ మనలో ఉంటే..!

Ram Gopal Varma: వర్మ మూవీకి దెబ్బ.. మరో నిర్మాతను మోసం చేసినందుకు శిక్ష..
Ravi Kiran
|

Updated on: Jul 18, 2022 | 9:12 PM

Share

తిమ్మిన బమ్మి చేయాలన్నా.. బమ్మిని తిమ్మి చేయాలన్నా.. గట్టిగా మాట్లాడితే సరిపోతుంది. అందులోనూ మేధావినన్న ఫిలింగ్ మనలో ఉంటే..! మాటల మధ్యలో అవతలోడికి అర్థం కాని లాజిక్‌తో కన్ఫూజ్‌ చేస్తే.. ! ఇక మనమే తోపులం కదా.. ఏ ఇష్యూలోనైనా మనదే గెలుపని ఫీలైతే.. ! ఎవరైనా ఎలా ఉంటారు.. ఆర్జీవీలాగే.. సింగిల్ పీసులానే ఉంటారు కదా..! అయితే ఇదే సింగిల్ పీస్ ఆర్జీవీ మరో సారి కోర్టు ముందు బొక్కబోర్లా పడ్డారు. మరో నిర్మాత పెట్టిన కేసుతో.. తన డ్రీమ్‌ ఫిల్మ్ ‘లడ్‌కీ’ ని థియేటర్ల నుంచి తీసేసే దాకా తెచ్చుకున్నారు.

ఇక ఇంతకు ముందే నట్టికుమార్ ఆర్జీవీ తనను మోసం చేశాడంటూ.. కోర్టు కెక్కారు. తనకు డబ్బులిచ్చే వరకు ‘లడ్‌కీ ‘ (Ladki), తెలుగులో ‘అమ్మాయి’ సినిమా రిలీజ్‌ వాయిదా వేయాలని కోర్టును కోరి.. సక్సెస్ అయ్యారు. అందుకు ప్రతిగా… ఆర్జీవి నట్టిపై పంజాగుట్టా పీఎస్‌లో కేసు పెట్టారు. తన సినిమా రీలీజ్‌ను అడ్డుకున్నందుకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తూ.. అంతా తూచ్‌ మేమిద్దం ఒకటే అంటూ.. మీడియా ముందుకు వచ్చారు. కాంప్రమైజ్ అయ్యాం అంటూ క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్టే.. తన డ్రీఫ్ ఫిల్మ్ లడ్‌కీ ని జూలై 15న గ్రాండ్ గా రిలీజ్ కూడా చేశారు వర్మ. అయితే థియేటర్లో స్క్రీన్ అవుతున్న ఈ సినిమాపై తాజాగా కోర్టు స్టే విధించింది. ఆర్జీవి తనను మోసం చేశాడంటూ.. తీసుకున్న డబ్బుల తిరిగి ఇవ్వడం లేదంటూ.. నిర్మాత కె. శేఖర్ రాజు వేసిన పిటీషన్‌ విచారణ తర్వాత ఈ తీర్పు వెలిబుచ్చింది.

అయితే సాఫ్ట్‌ వేర్ సుధీర్ సినిమా తీసిన తర్వాత.. ఆర్జీవీతో సినిమా తీయాలనుకు నిర్మాత శేఖర్.. అప్పట్లోనే ఆర్జీవీని కలిశారు. తన బ్యానర్లో సినిమా తీయాలని కోరారు. అందకు ఆర్జీవి ఓకే చెప్పి.. చాలా సార్లు నిర్మాత శేఖర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. కాని స్టోరీ చెప్పకుండా మాటలు దాటేస్తూ వచ్చేవారు. దీంతో విసిగిపోయిన శేఖర్ తీసుకున్న డబ్బులు తిరిగివ్వాల్సిందిగా ఇటీవల ఆర్జీవీని కోరారు. కాని ఆర్జీవీ డబ్బులు ఇవ్వకుండా…తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడంతో.. కోర్టును ఆశ్రయించారు శేఖర్.

ఆశ్రయించడమే కాదు.. పిటిషన్ ద్వారా తన బాధను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వర్మ తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేవరకు.. లడ్‌కీ సినిమా ఆపాలని కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. నిర్మాత శేఖర్‌కు అనుగుణంగా తీర్పు నిచ్చింది. లడకీ సినిమా ప్రదర్శన ఆపివేయాలంటూ.. మేకర్స్ ను ఆదేశించింది.