నయన్‌-విఘ్నేశ్‌ సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది.? ఆరేళ్ల క్రితమే వివాహమైందన్న దానిపై ఎలా స్పందిస్తుంది.?

నయనతార, విఘ్నేశ్‌ దంపతుల సంతానానికి సంబంధించి జరిగిన వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ జంట సరోగసి విధానంలో..

నయన్‌-విఘ్నేశ్‌ సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది.? ఆరేళ్ల క్రితమే వివాహమైందన్న దానిపై ఎలా స్పందిస్తుంది.?
nayanthara-vignesh surrogacy issue
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 25, 2022 | 3:29 PM

నయనతార, విఘ్నేశ్‌ దంపతుల సంతానానికి సంబంధించి జరిగిన వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ జంట సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెలరపైకి వచ్చాయి. సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారన్న వార్త ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహమైన నాలుగు నెలలకే ఈ జంట పిల్లలకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ జంట సరోగసి నిబంధనలను పాటించలేదనే వాదన తెరపైకి వచ్చింది.

సాధారణంగా సరోగసీ నియంత్రణ చట్టం 2021 ప్రకారం పెళ్లైన జంట ఐదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన తర్వాతే సరోగసీ విధానాన్ని ఆశ్రయించడానికి అనుమతులు ఉంటాయి. కానీ నయన్‌, విఘ్నేశ్‌లు దీనికి విరుద్దంగా సరోగసి విధానాన్ని ఆశ్రయించారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళరం ఈ విచారణ పూర్తయింది. విచారణ కమిటీ ప్రభుత్వానికి ఈ నివేదికను బుధవారం అందించనుంది. ఈ క్రమంలోనే నయనతార దంపతులు కమిటీకి ఆఫడవిట్ పంపారు.

ఈ ఆఫడవిట్‌లో ఈ జంట తమకు ఆరేళ్‌ల క్రితమే వివాహం జరిగిందని తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో సరోగసి కోసం దరఖాస్తు చేసుకున్నామని, కాబట్టి టెక్నీకల్‌గా తమకు వివాహ జరిగే ఆరేళ్లు గడించిందని నయన్‌ దంపతులు తెలిపారు. నిబంధనల మేరకే సరోగసి పద్ధతిని పాటించినట్లు కమిటీకి అఫిడవిట్‌లో తెలిపారు. ఈ విషయమై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్‌ మాట్లాడుతూ.. ‘బుధవారం కమిటీ నుంచి నివేదిక వస్తుంది. నివేదికను పరిశీలించాక అన్ని విషయాలు తెలుస్తాయి. నయనతార దంపతులు సరోగసి చేయించుకున్న ఆస్పత్రిని గుర్తించాం. నివేదిక తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..