Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: తీరుమార్చుకోని బిగ్ బీ భార్య .. మళ్ళీ మీడియాపై కస్సుబుస్సులాడిన జయా బచ్చన్ .. దీపావళి నాడు..

వివిధ కార్యక్రమాల్లో మీడియా ఫొటోగ్రాఫర్లు తన చిత్రాలను తీసే సమయంలో కలిగే అసౌకర్యం గురించి తరచుగా జయ మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో జయ సోమవారం రాత్రి తమ కుటుంబ సభ్యులతో ఇంటి వెలుపల ఉన్న ఫోటోగ్రాఫర్‌లపై కోపంగా ప్రతిస్పందించడం కనిపించింది.

Diwali: తీరుమార్చుకోని బిగ్ బీ భార్య .. మళ్ళీ మీడియాపై కస్సుబుస్సులాడిన జయా బచ్చన్ .. దీపావళి నాడు..
Jaya Bachchan gets angry at paparazzi
Follow us
Surya Kala

|

Updated on: Oct 25, 2022 | 1:46 PM

దీపావళి సందర్భంగా ముంబైలోని జుహూలోని ప్రతీక్ష బంగ్లాలో అమితాబ్ బచ్చన్ జయా దంపతులు తమ కుటుంబం సభ్యులతో కలిసి లక్ష్మీపూజ నిర్వహించారు. సోమవారం జరిగిన వేడుకల్లో ప్రముఖ బిగ్ బీ భార్య జయా బచ్చన్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోలో జయ తమ ఇంటి బయట ఉన్న ఫోటో గ్రాఫర్లను ‘చొరబాటుదారులు’ అని పిలుస్తూ తీవ్ర కోపంతో విచురుకుపడ్డారు. తమ ఫ్యామిలీ దీపావళి వేడుకల ఫోటోలను తీయడానికి ప్రయత్నించిన మీడియాకు చెందిన ఫోటో గ్రాఫర్లను తరిమికొట్టారు.

వివిధ కార్యక్రమాల్లో మీడియా ఫొటోగ్రాఫర్లు తన చిత్రాలను తీసే సమయంలో కలిగే అసౌకర్యం గురించి తరచుగా జయ మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో జయ సోమవారం రాత్రి తమ కుటుంబ సభ్యులతో ఇంటి వెలుపల ఉన్న ఫోటోగ్రాఫర్‌లపై కోపంగా ప్రతిస్పందించడం కనిపించింది. ఫోటో గ్రాఫర్లు షేర్ చేసిన క్లిప్‌లో.. ప్రింటెడ్ వైట్ కుర్తా ధరించిన జయ తమ ఇంటి గేటు దగ్గర కనిపించిన ఫోటోగ్రాఫర్‌లపై విరుచుకుపడ్డారు. అసలు మీరు ఇలా ఎలా చేస్తారు.. వెంటనే మీ కెమెరాల స్విచ్ ఆఫ్ చేయండి…” అని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మంది ఛాయాచిత్రకారులు  జయ తాజా చర్యపై ప్రతిస్పందించారు. “అబ్బాయిలు ఆమెను ఒంటరిగా వదిలేయండి… మీరు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకుంటారు అని కామెంట్ చేశారు.

దీపావళి 2022 పూజ కోసం అమితాబ్ , తన భార్య జయతో పాటు అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ దంపతులు ఆరాధ్య బచ్చన్  తో కలిసి ప్రతీక్ష దగ్గరకు వచ్చారు. అభిషేక్ కారు నడుపుతుండగా, అమితాబ్ పక్కనే కూర్చున్నారు. వెనుక సీట్లో జయ, ఐశ్వర్య, ఆరాధ్య కూర్చున్నారు. దీపావళి ఉత్సవాల కోసం అందరూ భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించారు.

ఇవి కూడా చదవండి

తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే వ్యక్తులంటే తనకు అసహ్యం అని జయా బచ్చన్ ఇటీవల అన్నారు. తమని తమ వ్యక్తిగత విషయాలను అమ్ముడకు తమ కడుపు నింపుకునే’ వారిని తాను తృణీకరిస్తున్నానని ఆమె పేర్కొంది.  రిని ద్వేషిస్తాను.. అలాంటి వారి పట్ల నాకు అసహ్యం..  నేను వారితో ఎప్పుడూ చెబుతుంటానని అన్నారు జయ.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..