Bigg Boss 7 Telugu: కూతురుతో కలిసి బిగ్‌బాస్ 7లోకి సురేఖా వాణి? ఫుల్ క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటీమణి
బుల్లితెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్‌షో ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 3 నుంచి ఈ రియాల్టీ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఏడో సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్‌పై ఇంకా అధికారిక ప్రకటన లేదు. అయితే గత రెండు నెలలుగా 'కంటెస్టెంట్లు వీరే' అంటూ సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
బుల్లితెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్‌షో ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 3 నుంచి ఈ రియాల్టీ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఏడో సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్‌పై ఇంకా అధికారిక ప్రకటన లేదు. అయితే గత రెండు నెలలుగా ‘కంటెస్టెంట్లు వీరే’ అంటూ సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సీనియర్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత పేర్లు కూడా ఉన్నాయి. ఈసారి తల్లీ కూతుళ్లు కలిసి హౌస్‌మేట్స్‌గా రానున్నారని, ఇది సాధ్యం కాకపోతే ఇద్దరిలో కనీసం ఒకరైనా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బిగ్‌బాస్ ఎంట్రీ వార్తలపై స్పందించింది సురేఖా వాణి. బిగ్‌బాస్ సీజన్‌లో పాల్గొనడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. తన కూతురు సుప్రీత కూడా ఈ రియాల్టీ షోలో పాల్గొనదని స్పష్టత నిచ్చింది సురేఖావాణి. కాగా ఈ తల్లీకూతుళ్ల బిగ్‌బాస్ ఎంట్రీపై ఇలా రూమర్లు రావడం, ఆపై ఖండించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ముఖ్యంగా ఐదో సీజన్‌లో ఇలాంటి పుకార్లు బాగా షికార్లు చేశాయి. అయితే ప్రతీసారి ఈ వార్తలను ఖండిస్తూనే ఉన్నారు.
కాగా లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రోల్స్‌తో తెలుగు సినిమాల్లో సందడి చేస్తోంది సురేఖా వాణి. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాలోనూ మెరిసిందీ అందాల తార. ఇక సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. నెట్టింట వీరు చేసే ఫొటోలు, డ్యాన్స్ వీడియోలకు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలను అనుకరిస్తూ తల్లీ కూతుళ్లు చేసే డ్యాన్స్‌లకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. కాగా త్వరలోనే సుప్రిత సినిమా ఇండస్ట్రీలోకి రానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ సీనియర్ నటీమణులు షకీలా, కిరణ్ రాథోడ్‌లు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లోకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కంటెస్టెంట్ల వివరాలపై క్లారిటీ రానుంది.
సురేఖా వాణి, సుప్రీతల డ్యాన్స్
View this post on Instagram
ఫారిన్ వెకేషన్ లో తల్లీ కూతుళ్లు
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.