Bigg Boss 7 Telugu: ఈసారి అంతా ఉల్టా పల్టా.. బిగ్‏బాస్ సీజన్ 7 టైమింగ్స్ ఏంటో తెలుసా ?..

గత కొన్ని రోజులుగా బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి చర్చ జరుగుతుంది. ఒకప్పుడు వెండితెరపై అలరించిన హీరోహీరోయిన్స్, సీరియల్స్ నటీనటులు, ఫేమస్ సెలబ్రెటీస్, యూట్యూబర్స్ తోపాటు..కామన్ మాన్ ఇంట్లోకి రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Bigg Boss 7 Telugu: ఈసారి అంతా ఉల్టా పల్టా.. బిగ్‏బాస్ సీజన్ 7 టైమింగ్స్ ఏంటో తెలుసా ?..
Bigg Boss 7 telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 29, 2023 | 12:49 PM

బుల్లితెరపై అసలైన వినోదం స్టార్ట్ కాబోతుంది. తెలుగు అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ రియాల్టీ షో త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 7తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సందడి మొదలైంది. గత కొన్ని రోజులుగా బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి చర్చ జరుగుతుంది. ఒకప్పుడు వెండితెరపై అలరించిన హీరోహీరోయిన్స్, సీరియల్స్ నటీనటులు, ఫేమస్ సెలబ్రెటీస్, యూట్యూబర్స్ తోపాటు..కామన్ మాన్ ఇంట్లోకి రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈసారి సరికొత్త టాస్కులతో.. ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. న్యూ గేమ్, న్యూరూల్స్, న్యూ ఛాలెంజెస్ అంటూ గతంలో కింగ్ నాగార్జున ప్రోమోతో మరింత క్యూరియాసిటి పెంచగా.. ఈసారి అంతా ఉల్టా పల్టా అంటూ ప్రోమోలతో మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

అయితే గత రెండు సీజన్స్ నుంచి రాత్రి 10 గంటలకు బిగ్‏బాస్ ప్రసారమవుతుంది. అప్పటి నుంచి 11 గంటల వరకు చూడాల్సిందే. ఇక నాలుగో సీజన్ 9.30 నుంచి10.30 వరకు వచ్చేది. వీకెండ్ నాగార్జున ఎపిసోడ్ మాత్రం శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి 10.30 వరకు వస్తుంది. హోస్ట్ ఎపిసోడ్ టైమింగ్స్ అలాగే ఉండగా.. మండే టూ ఫ్రైడే టైమింగ్స్ మాత్రం 10 నుంచి పెట్టారు. దీంతో బిగ్‏బాస్ చూసే అడియన్స్ సంఖ్యచాలా వరకు తగ్గింది.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

అయితే ఈసారి బిగ్‏బాస్ సీజన్ 7 టైమింగ్స్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈసారి బిగ్‏బాస్ 7 ను రాత్రి 9.30 నుంచి 10.30 వరకు టెలికాస్ట్ చేస్తారట. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 నుంచి 10.30 వరకు ప్రసారం కాగా.. వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 3న బిగ్‏బాస్ షో సాయంత్రం 7 గంటలకు కాబోతుంది. ఇక గతంలో మాదిరిగానే బిగ్‏బాస్ సీజన్ 7 కూడా డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.