AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ ఎలిమినేషన్ ట్విస్ట్.. డేంజర్ జోన్‏లో వారిద్దరూ.. ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ ?..

ఇప్పటివరకు ఐదు వారాలు పూర్తిచేసుకుంది. షానీ, అభినయ శ్రీ, ఆరోహి, చంటి, నేహ ఎలిమినేట్ అయిన సంగతి తెలసిందే. ఇక ఇప్పుడు ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియ సమయం వచ్చేసింది.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ ఎలిమినేషన్ ట్విస్ట్.. డేంజర్ జోన్‏లో వారిద్దరూ.. ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ ?..
Bigg Boss Eliminations
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2022 | 11:48 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 6 విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 21 కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో.. ఇప్పటివరకు ఐదు వారాలు పూర్తిచేసుకుంది. షానీ, అభినయ శ్రీ, ఆరోహి, చంటి, నేహ ఎలిమినేట్ అయిన సంగతి తెలసిందే. ఇక ఇప్పుడు ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియ సమయం వచ్చేసింది. శనివారం ఎపిసోడ్ లో ఇంటిసభ్యులకు చివాట్లు పెట్టిన నాగ్.. నామినేట్ అయిన వారిలో ఒకరిని ఇంటి నుంచి బయటకు పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రతివారం ఎలిమినేట్ అయ్యే సభ్యుడి పేరు ముందే నెట్టింట లీక్ అవుతుంది. ఇక ఆడియన్స్ ఊహించినట్టుగానే సదరు హౌస్మేట్స్ బయటకు వచ్చేస్తున్నారు. ఇక ఆరోవారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ పేరు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈవారం ఇంటి నుంచి బయటకు ఎవరు రాబోతున్నారనే విషయం మళ్లీ లీక్ అయ్యింది.

మిగిలిన 16 మంది కంటెస్టెంట్లలో ఆరోవారం నామినేట్ అయిన సభ్యులు.. శ్రీహాన్, బాలాదిత్య, శ్రీసత్య, గీతూ రాయల్, కీర్తి భట్, ఆదిరెడ్డి, సుదీప, రాజశేఖర్, మెరీనా ఉన్నారు. వీరిలో ఆదిరెడ్డి, గీతూ రాయల్, శ్రీహాన్ సేఫ్ జోన్ లో ఉన్నారు. అలాగే వారం రోజులుగా శ్రీసత్య, కీర్తిభట్, రాజ్ ఆట తీరులో మార్పు రావడంతో వీరికి ఆడియన్స్ మద్దతు లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో వీరు కూడా సేఫ్ కాగా.. చివరిగా.. బాలాదిత్య, సుదీప, మెరీనా డెంజర్ జోన్‏లో ఉన్నట్లుగా సమాచారం. అయితే ముందు నుంచి వినిపిస్తున్న సమాచరం ప్రకారం.. సుదీప, మెరీనా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. కానీ ఊహించని విధంగా మెరీనా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రోహిత్, మెరీనా జోడిగా బిగ్ బాస్ ఇంట్లో ఉండడం కచ్చితమని.. వీరిద్దరూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇవ్వడంలో ఉపయోగపడవచ్చు అని బిగ్ బాస్ మెరీనాను సేవ్ చేశారని.. దీంతో బాలాదిత్య డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక చివరగా.. సుదీప, బాలాదిత్య మధ్య టఫ్ ఫైట్ నడిచిందని.. అయితే ఇంటి సభ్యుల కోసం బాలాదిత్య సిగరెట్స్ త్యాగం చేయడం.. గీతూ కావాలని ప్రతిసారి బాలాదిత్యను టార్గెట్ చేయడంతో అతనికి కాస్త మద్దతు లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వారం సుదీప ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం. ఇక సుదీప నిజంగానే ఇంటి నుంచి బయటకు వచ్చిందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!