Bigg Boss 6 Telugu: రోహిత్ కోసం వాసంతి త్యాగం.. నాగార్జున ముందే జుట్టు కట్ చేసిన సూర్య..
ఉదయాన్నే సూర్య, ఇనయ కలిసి ఫైమా గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారు. ఇక ఫైమా గీతు దగ్గరకు చేరి ఇనయ, సూర్య చాలా సంతోషంగా ఉన్నారు కదా అంటూ చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 6 వీకెండ్ వచ్చేసింది. ఇంటి సభ్యుల ఆట తీరును ప్రశ్నిస్తూ.. ఇంటి సభ్యుల కోసం రెండు వారాలు నేరుగా నామినేట్ అయిన రోహిత్‌ను పొగడడమే కాకుండా.. హౌస్మే్ట్స్ కళ్లు తెరిపించాడు. ఇక శనివారం నాటి ఎపిసోడ్లో శుక్రవారం జరిగిన సంఘటనలను చూపించారు నాగ్. ఉదయాన్నే సూర్య, ఇనయ కలిసి ఫైమా గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారు. ఇక ఫైమా గీతు దగ్గరకు చేరి ఇనయ, సూర్య చాలా సంతోషంగా ఉన్నారు కదా అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సూర్య వాష్ రూంలో ఉండే… అతని వద్దకు వెళ్లి సూర్య నా క్రష్ అని చెప్పింది. ఆ తర్వాత సువర్ణభూమి వారి సొంతింటి కల టాస్క్ ఆడారు. అందులో శ్రీహాన్ టీం గెలిచింది.
ఇక అనంతరం.. నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. రోహిత్ పై ప్రశంసలు కురిపించారు. హౌస్మేట్స్ కోసం చేసిన త్యాగాన్ని మెచ్చుకున్నారు. అలాగే అతను నేరుగా నామినేట్ కావడం వలన ఆరుగురు రీచార్జ్ కావడం.. వారు ఎవరు నిలబడాలని అడిగగా.. వాళ్లు అందరూ నిలబడడం.. రోహిత్ గురించి ఏ ఒక్కరు ఆలోచించలేదు అంటూ ప్రశ్నిస్తూనే వీడియో చూపించారు. అందులో నా వల్లా 100 శాతం చార్జ్ అయ్యింది. అయినా నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అంతా సెల్ఫిష్ అంటూ రోహిత్ చెప్పిన వీడియోను చూపించారు. ఇక ఇప్పుడు వారు ఆరుగురులో ఒకరు రోహిత్ కోసం ఓ త్యాగం చేయాలన్నారు. దీంతో వారంతా మేము చేస్తామంటూ ముందుకు వచ్చారు. అయితే నాగార్జున ఆదిరెడ్డిని ఎవరు త్యాగం చేస్తే బాగుంటుందని ప్రశ్నించారు. దీంతో వాసంతి త్యాగం చేయాలని సూచించాడు ఆదిరెడ్డి.
దీంతో వాసంతి జుట్టుని షోల్డర్ వరకు చేసుకోవాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.అయితే హెయిర్ అంటే నాకు మా అమ్మకి చాలా ఇష్టమని.. అయినా త్యాగం చేయడానికి సిద్ధమే అని చెప్పింది వాసంతి. దీంతో కెప్టెన్ సూర్య చేతుల మీదుగా నాగార్జున కళ్లముందే వాసంతి హెయిర్ షోల్డర్ పై వరకు కట్ చేయించారు. ఇక సూర్య కత్తెర తీసుకుని వాసంతి హెయిర్ కట్ చేశారు. అయితే హెయిర్ కట్ తర్వాత వాసంతి మరింత అందంగా కనిపించింది. ఇక ఆమె జుట్టు కత్తిరించుకోవడం వలన బెనిఫిట్ ఏంటని ఆదిరెడ్డి అడగ్గా..నువ్ అడిగావ్ కాబట్టి బెనిఫిట్ ఇస్తున్నానంటూ రోహిత్ కోసం వాళ్ల ఫ్యామిలీ వీడియోను ప్లే చేసి చూపించారు.