Producer Katragadda Murari: ఇండస్ట్రీలో విషాదం.. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత మృతి..
గోరింటాకు.. నారి నారి నడుమ మురారి, త్రిశూలం, అభిమన్యుడు, జానకి రాముడు సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన జానకి రాముడు సినిమా ..
తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్ కావాలని ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. యువచిత్ర ఆర్ట్స్ పేరుతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. గోరింటాకు.. నారి నారి నడుమ మురారి, త్రిశూలం, అభిమన్యుడు, జానకి రాముడు సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన జానకి రాముడు సినిమా .. అటు నాగార్జున.. ఇటు విజయశాంతి కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. కాట్రగడ్డ మురారి మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాడు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1944 జూన్ 14న విజయవాడలో జన్మించారు కాట్రగడ్డ మురారి. దర్శకుడు కావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన అన్ని సినిమాలకు కేవీ మహదేవన్ సంగీతం అందించారు. సంగీతంపరంగానూ అనేక చిత్రాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 90వ దశకం వరకు పలు విజయవంతమైన సినిమాలను 2012లో నవ్విపోదురు గాక పేరుతో ఆత్మకథ రాశారు. కాట్రగడ్డ మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయుకులు సంతాం తెలిపారు.