AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్‍బాస్ 8 కోసం కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లా?

బుల్లితెర ఆడియెన్స్ కు వినోదం అందించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సెలబ్రిటీ రియాలిటీ గేమ్ షో 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే విడుదల చేశారు. లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు

Bigg Boss Telugu 8: బిగ్‍బాస్ 8 కోసం కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లా?
Bigg Boss Telugu Season 8
Basha Shek
|

Updated on: Jul 25, 2024 | 2:53 PM

Share

బుల్లితెర ఆడియెన్స్ కు వినోదం అందించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సెలబ్రిటీ రియాలిటీ గేమ్ షో 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే విడుదల చేశారు. లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ కొత్త సీజన్ కు హోస్ట్ మారుతారని గుసగుసలు వినిపించాయి. అక్కినేని నాగార్జున స్థానంలో మరొక స్టార్ హీరో బిగ్ బాస్ ను నడిపిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం రూమర్లుగానే మిగిలి పోయాయి. బిగ్‍బాస్ 8వ సీజన్‍కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అయితే, గత సీజన్‍తో పోలిస్తే ఈ నయా సీజన్‍కు ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని సమాచారం.

ఈసారి అదనంగా 10 కోట్లు..

బిగ్ బాస్ 8వ సీజన్ కోసం నాగార్జున ఏకంగా రూ.30కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది. 7వ సీజన్ కోసం రూ.20కోట్లను నాగార్జున అందుకున్నారు. అయితే, ఈ కొత్త సీజన్ కోసం ఆయన రూ.10కోట్లు అధికంగా తీసుకోనున్నారట. అంటే ఓవరాల్ గా రూ. 30 కోట్లు నాగ్ అందుకోనున్నారన్నమాట. ఒక టీవీ షోకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడమంటే మాములు విషయమేమీ కాదు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది. సోనియా సింగ్, కుమారీ ఆంటీ, యాంకర్లు రీతు చౌదరి, విష్ణు ప్రియ, నటుడు ప్రభాస్ శీను, కమెడియన్ యాదమరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే యూట్యూబర్లు బంచిక్ బబ్లూ, అనిల్ గీలా, అలీ సోదరుడు ఖయ్యూం కూడా హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్