AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minimum Degree: బిగ్‏బాస్ 9లో అవకాశం ఇవ్వాలి.. లేదంటే నిరాహార దీక్ష.. బ్యానర్ కట్టిన మల్టీస్టార్ మన్మధ రాజ..

బిగ్‏బాస్ సీజన్ 9 పై ఇప్పుడే చర్చ మొదలైంది. సెప్టెంబర్ నెలలో ఈ షో స్టార్ట్ కానుందనే సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో .. కంటెస్టెంట్స్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా కంటెస్టెంట్స్ వెతికే పనిలో పడ్డారట. ఇప్పటికే స్టార్ మా ఛానల్లో వచ్చే పలు షోలలో పాల్గొనే సీరియల్ నటులే ఈసారి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Minimum Degree: బిగ్‏బాస్ 9లో అవకాశం ఇవ్వాలి.. లేదంటే నిరాహార దీక్ష.. బ్యానర్ కట్టిన మల్టీస్టార్ మన్మధ రాజ..
Minimum Degree
Rajitha Chanti
|

Updated on: May 30, 2025 | 1:51 PM

Share

బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తొలినాళ్లల్లో సినిమా, సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఈ రియాల్టీ షోలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు.. వెంటనే బిగ్‏బాస్ షోలోకి పట్టుకోస్తున్నారు నిర్వాహకులు. కొన్ని సీజన్స్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు.. సీరియల్ నటీనటులు మాత్రమే ఈ షోలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివిటీ లేదా వివాదమో.. ఎలాగైనా సరే.. ఎవరి పేరు నెట్టింట మారుమోగుతుందో వాళ్లను ఏరికోరి మరీ ఈ రియాల్టీ షోలోకి పట్టుకోస్తుంటారు. దీంతో ఇప్పుడు నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు బిగ్‏బాస్ ఛాన్స్ కావాలని రెడీ అయిపోతున్నారు. రైతు బిడ్డనంటూ సామాన్యుడిగా బిగ్‏బాస్ హౌస్ లోకి వెళ్లి విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. కానీ గ్రాండ్ ఫినాలే రోజే తన ప్రవర్తనతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మాక్కుడా బిగ్‏బాస్ రియాల్టీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట వీడియోస్ షేర్ చేస్తున్నారు కొందరు. తాజాగా తనకు బిగ్‏బాస్ కంటెస్టెంట్ గా అవకాశం ఇవ్వాలంటూ అన్నపూర్ణ స్టూడియో ముందు బ్యానర్ కట్టేశాడు ఓ వ్యక్తి. అతడు మరెవరో కాదు.. “మినిమల్ డిగ్రీ ఉండాలి” అనే ఒక్క డైలాగ్ తో నెట్టింట ఫేమస్ అయిపోయాడు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూలు చెప్పే ఈ వ్యక్తి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. మినిమమ్ డిగ్రీ ఉండాలంటూ అతడు చెప్పిన ఒక్క డైలాగ్ తెగ మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే క్రేజ్ తో తనకు బిగ్‏బాస్ రియాల్టీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ ఏకంగా బ్యానర్ కట్టేశాడు.

బిగ్‏బాస్ సీజన్ 9కి ఛాన్స్ ఇవ్వాలి.. లేదంటే నిరాహార దీక్ష చేస్తా.. మల్టీస్టార్ మన్మధ రాజ.. సినిమా యాక్టర్.. మినిమం డిగ్రీ అంటూ బ్యానర్ కట్టి అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నాకు దిగాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ పలువురి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య సైతం ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం నడుస్తుంది.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..