AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Passport: పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ పనికిరాదా..? కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ..

పాస్‌పోర్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం అని, అది పారసత్వ డాక్యుమెంట్ కాదని తేల్చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. విదేశాల్లో భారత జాతీయుతను ధృవీకరించే పత్రం అని తెలిపింది.

Passport: పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ పనికిరాదా..? కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ..
Indian Passport
Venkatrao Lella
|

Updated on: Jun 25, 2026 | 8:48 AM

Share

పాస్‌పోర్ట్‌పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన జారీ చేసింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, పౌరసత్వ పత్రం కాదని స్పష్టం చేసింది. 1967లో పాస్‌పోర్ట్ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా జూన్ 24న పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వచ్చే వారం రెండు రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరమ్‌ను నిర్వహించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వలసలకు సంబంధించి చట్టపరమైన మార్గాలను తెలియజేయడం, విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే భారతీయ పౌరులకు, విదేశీ యజమానులకు మధ్య నెట్‌వర్కింగ్‌ను సులభతరం చేయడం కోసం హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరమ్‌ నిర్వహిస్తున్నారు.

పాస్‌పోర్ట్ పౌరసత్వ పత్రం కాదు..

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పాస్‌పోర్ట్ అనేది ప్రయాణ పత్రంగానే ఉంటుందని, పౌరసత్వ పత్రం కాదని తెలిపింది. భారతీయులు విదేశాలలో ఉన్నప్పుడు వారి జాతీయతను పాస్‌పోర్ట్ ధృవీకరిస్తుందని, పౌరసత్వ పత్రంగా పనిచేయదని అధికారులు తెలిపారు. వ్యక్తి వివరాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాస్‌పోర్ట్ జారీ చేస్తారని, ఇది పలు ప్రభుత్వ సంస్థల పత్రాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. గతేడాది చిప్ ఆధారిత పత్రాలను ప్రవేశపెట్టినప్పటి నుంచి మొత్తం 14.7 మిలియన్ల ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేశామన్నారు. ఈ-పాస్‌పోర్టుల్లో అంతర్నిర్మిత యాంటెన్నా, వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్ డేటాను కలిగి ఉంటాయి. ప్రస్తుతం మొత్తం పాస్‌పోర్ట్‌లలో సుమారు 10 శాత పాస్‌పోర్టులు ఉన్నాయి. ప్రస్తుతం జారీచేసే కొత్త పాస్‌పోర్ట్‌లన్నీంటికి చిప్ జోడిస్తున్నారు. ఈ-పాస్‌పోర్ట్‌లు అధిక భద్రతను అందిస్తాయి. అలాగే అనధికారికంగా డేటాను యాక్సెస్ చేసే లేదా తారుమారు చేసే అవకాశాన్ని, మోసపూరిత మార్గాల ద్వారా పత్రాన్ని పొందే అవకాశాన్ని తగ్గిస్తాయి.

నకిలీ పాస్‌పోర్టులు కష్టం

ఈ విధాంనలో నకిలీ పాస్‌పోర్ట్‌లను సృష్టించడం కూడా చాలా కష్టం. ఈ-పాస్‌పోర్ట్‌లు విదేశాల్లోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరింత భరోసాను అందించి క్లియరెన్స్‌లను వేగవంతం చేస్తాయి. ఈ-పాస్‌పోర్ట్‌లలో ఉపయోగించే చిప్‌లను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నుండి తెప్పిస్తున్నారు. వారు వాటిని విదేశాల నుండి సేకరిస్తున్నారు. అయితే పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్‌కు టీసీఎస్ సాంకేతికను అందిస్తోంది. పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన మొత్తం డేటా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సర్వర్లలో నిల్వ చేయబడి ఉంటుంది. జూన్ 30 మరియు జూలై 1 తేదీలలో జరగనున్న హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరమ్‌కు డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా ప్రధాన దేశాలుగా ఉండనున్నాయి. కార్మికులు, నియామక సంస్థలు, విదేశీ యజమానులను ఒకచోట చేర్చనుంది.

Follow Us
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?