AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్.. ఆ ఒక్క తప్పుతో అసలుకే మోసం..: వైభవ్‌ను హెచ్చరించిన వెస్టిండీస్ దిగ్గజం

Vaibhav Suryavanshi: ఒక అద్భుతమైన ప్రతిభ అంతర్జాతీయ వేదికపైకి వస్తున్నప్పుడు ఇలాంటి దిగ్గజాల సలహాలు అమూల్యమైనవి. వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగిస్తూనే, మైదానంలో క్రమశిక్షణను అలవరచుకుంటే భారత క్రికెట్‌లో తిరుగులేని లెజెండ్‌గా ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఈ యువ పులి ఎలా గర్జిస్తుందో చూడాలి.

15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్.. ఆ ఒక్క తప్పుతో అసలుకే మోసం..: వైభవ్‌ను హెచ్చరించిన వెస్టిండీస్ దిగ్గజం
Ind Vs Eng Vaibhav Suryavanshi Clive Lloyd
Venkata Chari
|

Updated on: Jun 25, 2026 | 8:55 AM

Share

Vaibhav Suryavanshi: భారత క్రికెట్‌లో పెను సంచలనం సృష్టిస్తూ, కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే తన అద్వితీయ బ్యాటింగ్‌తో యావత్ క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై వెస్టిండీస్ లెజెండ్ క్లైవ్ లాయిడ్ ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, అదే సమయంలో మైదానంలో ప్రవర్తనపై ఈ కరేబియన్ దిగ్గజం ఇచ్చిన ఒక విలువైన సలహా ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

భవిష్యత్తు సూపర్ స్టార్.. గుడ్డిగా కాకుండా టెక్నిక్‌తో హిట్టింగ్..!

ఐర్లాండ్‌తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్న వైభవ్ సూర్యవంశీకి ఇప్పటికే బీసీసీఐ నుంచి జెర్సీ నెంబర్ 3 లభించింది. ఈ తరుణంలో 1975, 1979 ప్రపంచకప్ విజేత క్లైవ్ లాయిడ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైభవ్ బ్యాటింగ్ శైలిని ఆకాశానికెత్తారు. “వైభవ్ కేవలం బంతిని బలంగా బాదడమే కాదు, అద్భుతమైన టైమింగ్, క్లాసిక్ షాట్లతో అలరిస్తున్నాడు. అతను ఏమాత్రం గుడ్డిగా ఆడటం లేదు. పక్కా టెక్నిక్‌తో బౌండరీలు దాటిస్తున్నాడు. చాలా సార్లు కోచ్‌లు యువ ఆటగాళ్ల సహజ సిద్ధమైన ఆటను మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వైభవ్ విషయంలో ఆ తప్పు చేయకుండా అతనికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి” అని లాయిడ్ హితవు పలికాడు.

మా కాలపు భీకర పేసర్లను ఎదుర్కొని ఉంటే.. లాయిడ్ ఆసక్తికర విశ్లేషణ!

మైఖేల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్, ఆండీ రాబర్ట్స్, కోలిన్ క్రాఫ్ట్ వంటి చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను వైభవ్ ఎదుర్కొని ఉంటే ఎలా ఉండేదన్న ప్రశ్నకు లాయిడ్ చాలా ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. “అదే జరిగి ఉంటే అది కచ్చితంగా వైభవ్ మానసిక బలానికి, సామర్థ్యానికి అసలైన అగ్నిపరీక్షగా నిలిచేది. వైభవ్‌కు అద్భుతమైన ఐసైట్, పవర్‌ఫుల్ హిట్టింగ్ నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టి మా బౌలర్లకు, అతనికి మధ్య పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగేది” అని వ్యాఖ్యానించాడు. ఇటీవలే భారత్-ఏ తరఫున ఆడుతూ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్, 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్‌కు టైటిల్ అందించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మైదానంలో ఆ ప్రవర్తన సరికాదు.. వివాదాలకు దూరంగా ఉండాలి!

ప్రశంసలు కురిపిస్తూనే, శ్రీలంక పర్యటనలో అక్కడి ఆటగాళ్లతో వైభవ్ వాగ్వాదానికి దిగడాన్ని క్లైవ్ లాయిడ్ తీవ్రంగా తప్పుబట్టాడు. “మైదానంలో స్లెడ్జింగ్, కయ్యాలు సహజమే అయినా ఆట సమగ్రతను కాపాడటం చాలా ముఖ్యం. ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు యువ ఆటగాళ్లు తొందరపడి నోరు పారేసుకోకూడదు. నేరుగా అంపైర్లకు ఫిర్యాదు చేయాలి. మ్యాచ్ రిఫరీలు కూడా కఠినంగా వ్యవహరించి జరిమానాలు విధించాలి. వైభవ్ కూడా ఆ మ్యాచ్‌లో గొడవపడకుండా అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాల్సింది” అని లాయిడ్ స్పష్టం చేశాడు. వివాదాలకు దూరంగా ఉంటేనే సుదీర్ఘ కెరీర్ సాధ్యమవుతుందని, ఈ యువ సంచలనాన్ని బీసీసీఐ సరైన మార్గంలో గైడ్ చేయాలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us