Pavithra Nath: నా భర్తకు అమ్మాయిల పిచ్చి ఉంది.. అంటూ మొగలిరేకుల ఫేం పవిత్రనాథ్‌పై భార్య సంచలన ఆరోపణలు
Mogali Rekulu Fame Pavithra Nath: సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ.. నలుగురికి మంచి చెడులను తమ పాత్రల ద్వారా చెప్పే నటీనటుల్లో.. కొంతమంది..
Mogali Rekulu Fame Pavithra Nath: సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ.. నలుగురికి మంచి చెడులను తమ పాత్రల ద్వారా చెప్పే నటీనటుల్లో.. కొంతమంది నిజజీవితంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ.. ఇప్పటికే పలువురి మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ కోవలోకి వచ్చాడు. మొగలి రేకుల ఫేం పవిత్ర నాథ్.. సూపర్ హిట్ సీరియల్ మొగలి రేకుల్లో దయా పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూపర్ హిట్ సీరియల్ కృష్ణ తులసిలో అర్జున్ .. మల్లికార్జున్ అంటూ విలన్ క్యారెక్టర్ లో తనదైన శైలిలో విలనిజంతో బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే నిజ జీవితంలో కూడా నా భర్త మంచి వాడు కాదు.. అనేక మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని పవిత్ర నాథ్ భార్య శశిరేఖ మళ్ళీ సంచలన ఆరోపణలు చేసింది.
తాజాగా శాశిరేఖ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. నటుడు పవిత్రనాథ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందంటూ.. రాసలీలల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి కూడా అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు.. తమకు 2009లో పెళ్లి జరిగిందని.. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తెలిపింది. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడు.. అత్తమామలు కూడా కొడుక్కే వంత పాడతారు. అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉంటారు. కుటుంబ పోషణ కోసం తాను ఉద్యోగం చేస్తున్నట్లు.. అయితే ఆడపిల్లలు కనుక వారి భవిష్యత్ పై ఆందోళన ఉందని తెలిపింది శశిరేఖ. ఆడపిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేయకూడదు అంటూ.. ఇన్ని రోజులు ప్రవిత్ర నాథ్ కుటుంబం పెట్టె హింసను తట్టుకున్నానని.. అయితే ఇక తన వల్లకాదని చెప్పింది. విడాకులు ఇవ్వమని అడిగితే ఇవ్వ కుండా వేధిస్తున్నాడని తన భర్త నుంచి తనను రక్షించమని కోరింది.
పవిత్ర నాథ్ జాతకాలు చెబుతా అంటూ.. అమ్మాయిలను నేరుగా ఇంటికి తీసుకుని వస్తాడని శశిరేఖ ఆరోపణలు చేసింది. అంతేకాదు తన భర్తకు ఉన్న ఎఫైర్లకు సంబందించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. ఓ అమ్మాయితో కొన్ని ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించాడని.. దీంతో తాను అతనిపై గతంలోనే కేసు పెట్టినట్లు చెప్పింది శశిరేఖ. మాకు రెండు ఇల్లు ఉన్నాయి.. వాటిల్లో ఒకటి నా భర్త పేరున ఉండగా.. రెండోది తన పిల్లల పేరున ఉంది. ఈ రెండు ఇల్లు అమ్మేసి.. వచ్చిన డబ్బుని మా పిల్లల పేరున పిక్సిడ్ డిపాజిట్ చేయమని అర్దిస్తుంది. నాకు నా భర్త సంపాదనలో రూపాయి కూడా వద్దు.. ఆడపిల్లల భవిష్యత్ కు భరోసా ఇస్తే చాలు అంటూ వేడుకుంటుంది శశిరేఖ. అయితే భార్య చేస్తున్న ఆరోపణలపై పవిత్రనాథ్ ఇప్పటి వరకూ స్పందించలేదు..
Also Read: ఉత్తరాఖండ్‌లో రికార్డ్ స్థాయిలో వర్షాలు.. 47 మంది మృతి.. తాజా పరిస్థితిపై ఆరాతీసిన ప్రధాని మోడీ